Huge Profits In Brinjal Crop
Brinjal Crop : వంకాయ అంటే నోరూరని వారెవరూ ఉండరనేది అతిశయోక్తి కాదు. ఇంత ప్రశస్తి పొందిన వంకాయను పండించడం కూడా అంతే గగనం. మనుషులకే కాదు చీడపీడలకు కూడా వంగ తోట ప్రీతి పాత్రమే. అందుకే మొక్క ఆరాకుల దశకు ఎదిగింది మొదలు వివిధ రకాల పురుగులు దాడి మొదలు పెడతాయి. వీటిని గమనిస్తూ.. వాటిని సమగ్రంగా నివారిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులకు ఆస్కారం. దీన్నే తూచా తప్పకుడా పాటిస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు శ్రీనివాస్.
READ ALSO : Pomegranate Cultivation : దానిమ్మ సాగులో కొమ్మ కత్తిరింపులు, పూత,నియంత్రణలో యాజమాన్యం!
పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, భీమవరానికి చెందిన రైతు శ్రీనివాస్ వంగసాగు చేపట్టాడు. వంగను దీర్ఘకాలిక పంటగా, స్వల్పకాలిక పంటగానూ సాగు చేస్తుంటారు రైతులు. దీర్ఘకాలిక పంటగా 7 నుండి 8 నెలల వరకు పంట కాలం ఉంటుంది. అయితే తెగుళ్ళు, పురుగులు ఆశించకుండా ఉన్నపుడు మాత్రమే దీర్ఘకాలిక పంటకు వెళ్ళడం మంచిది. లేకపోతే దిగుబడి రాకపోగా పెట్టుబడి పెరిగి లాభాలు తగ్గిపోవడం జరుగుతుంది.
READ ALSO : Taiwan Jama : తైవాన్ జామకు… తేయాకు దోమ బెడద
అందుకే వంగ పంటలో చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవారు ఏ పంట యాజమాన్యమైనా చేయగలరన్నది పెద్దల మాట. ఈ మాటనే రుజువు చేస్తూ… మంచి దిగుబడులను తీస్తున్నారు రైతు శ్రీనివాస్. వ్యవసాయంపై ఉన్న మక్కువతో 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని రెండేళ్లుగా వంగను పండిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు శ్రీనివాస్. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి.