Intercropping In Oil Palm : పామాయిల్ లో అంతర పంటగా బొప్పాయి, పుచ్చసాగు

బొప్పాయి దిగుబడి రావడానికి 7 నెలల సమయం పడుతుంది. అందులో మొక్కల మధ్య దూరం ఉండటం చేత మూడో పంటగా పుచ్చను ఏడున్నర ఎకరాల్లో సాగుచేశారు. ప్రస్తుతం పుచ్చ కోతకు వచ్చింది.

Intercropping In Oil Palm

Intercropping In Oil Palm : తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన మూడెళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక, రైతులు మొదటి రెండు మూడు ఏళ్లు అంతర పంటలు సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఆయిల్ ఫాంలో అంతర పంటలుగా బొప్పాయి, పుచ్చసాగుచేస్తూ.. అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

READ ALSO : Papaya Cultivation : బొప్పాయి సాగులో రైతులు అనుసరించాల్సిన సస్యరక్షణ చర్యలు!

మొత్తం 10 ఎకరాల్లో విస్తరించిన ఈ తోట పశ్చిమగోదావరి జిల్లా, తాడెపల్లి గూడెం మండలం , జగ్గన్నపేట గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని గొర్రెల శ్రీధర్. 2020 లో పామాయిల్ మొక్కలు నాటారు. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి, మొదటి ఏడాది వేరుశనగను సాగుచేశారు. తరువాత పుచ్చను సాగుచేశారు. ప్రస్తుతం మూడవ సంవత్సరం కాబట్టి అంతర పంటగా బొప్పాయిని సాగుచేశారు.

READ ALSO : Papaya Cultivation : బొప్పాయి సాగులో తెగుళ్ళు, నివారణా చర్యలు

బొప్పాయి దిగుబడి రావడానికి 7 నెలల సమయం పడుతుంది. అందులో మొక్కల మధ్య దూరం ఉండటం చేత మూడో పంటగా పుచ్చను ఏడున్నర ఎకరాల్లో సాగుచేశారు. ప్రస్తుతం పుచ్చ కోతకు వచ్చింది. అంతర పంటలపై వచ్చే ఆదాయం ప్రధాన పంటకు పెట్టుబడి కాగా, ప్రధాన పంట అయిన పామాయిల్ పై వచ్చేది నికర ఆదాయం అంటున్నారు రైతు.

READ ALSO : Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా బంతి సాగు

సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నపరిస్థితుల్లో… ప్రతీ రైతు ఆదాయం పెంచుకునే దిశగా… ఆధునిక పరిజ్ఞానంతో, ప్రణాళికాబద్దంగా ముందడుగు వేయాల్సిన అవసరం వుంది.

ట్రెండింగ్ వార్తలు