Mint Cultivation : ఒక్కసారి పంట వేస్తే రెండేళ్ళపాటు దిగుబడి! కాసులు కురిపిస్తున్న పుదీనా సాగు!

నవంబరు నుండి డిసెంబరు మసాల్లో పుదీనా సాగుకు అనుకూల సమయం. చల్లవాతావరణం పంటకు అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాల వ్యవధిలో అధిక అదాయాన్ని ఇచ్చే పంటగా పుదీనా ప్రసిద్ధి చెందింది. చాలా మంది రైతులు పుదీనా సాగు చేపట్టి అధిక అదాయాన్ని ఆర్జిస్తున్నారు.

Mint Cultivation : ఒక్కసారి పంట వేస్తే రెండేళ్ళపాటు దిగుబడి! కాసులు కురిపిస్తున్న పుదీనా సాగు!

Mint Cultivation :

Updated On : December 20, 2022 / 10:44 AM IST

Mint Cultivation : ఆకుకూరల సాగులో పుదీనా కూడా ఒకటి. సారవంతమైన నేలలు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రునేలల్లో దీనిని సాగు చేయవచ్చు. పుదీనాను రెండు పద్దతులను అనుసరించి సాగు చేయవచ్చు. ఒకటి కాండం ను మొక్కలుగా నాటుకోవటం, రెండు విత్తనాలను వేయటం ద్వారా సాగు చేయవచ్చు.

నవంబరు నుండి డిసెంబరు మసాల్లో పుదీనా సాగుకు అనుకూల సమయం. చల్లవాతావరణం పంటకు అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాల వ్యవధిలో అధిక అదాయాన్ని ఇచ్చే పంటగా పుదీనా ప్రసిద్ధి చెందింది. చాలా మంది రైతులు పుదీనా సాగు చేపట్టి అధిక అదాయాన్ని ఆర్జిస్తున్నారు. షెడ్ నెట్ విధానంలో సైతం దీనిని సాగు చేయవచ్చు. అర ఎకరం పొలంలో పుదీనా సాగుకు 10 వేల వరకు ఖర్చవుతుంది. ప్రతి నెల 20 నుండి 30 వేల వరకు అదాయం పొందవచ్చు.

పుదీనాలో అంతర కృషి, ఎరువులు, నీటి యాజమాన్యం ;

మొక్కలు నాటిన 25 రోజులకు ఒకసారి కలుపు మొక్కలను ఎరివేయాలి. మొక్కలు పెరుగుతున్న దశలో కలుపు ను నివారించటం ఇబ్బందిగా మారుతుంది. అలాగే ఒక కూత పూర్తయిన తరువాత తిరిగి కలుపు నివారణ చేపట్టాలి. పుదీనా వేర్లే నేలపై భాగంలోనే పరచుకుని ఉంటాయి. కాబట్టి తక్కువ మోతాదులో నీటి తడులు ఇవ్వాలి. వేసవి సమయంలో 4 రోజులకు ఒకసారి నీటితడులు ఇవ్వాల్సి ఉండగా చలికాలంలో 12 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది.

పుదీనా సాగు చేయాలని భావిస్తే ఆఖరి దుక్కిలో ఎరానికి 5 టన్నుల పశువుల ఎరువు , 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ లను వేసుకోవాలి. పుదీనాలో కాండం కుళ్లు వంటి సమస్యలను అధిగ మించటానికి పంట మార్పిడి చేయాలి.