Pest Control In Paddy
Pest Control In Paddy : నెల్లూరు జిల్లాలో సాగవుతున్న ఎడగారు వరి ప్రస్థుతం దుబ్బుచేసే దశలో వుంది. ఏప్రెల్ మే మాసాల నుండి ఆగష్టు సెప్టెంబరు వరకు ఇక్కడ వరి పండిస్తారు. పైరు ఎదుగదల దశలో వివిధ చీడపీడల ఆశించే ప్రమాధం వున్నందున, వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండాలని నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఐ. పరమశివ సూచిస్తున్నారు.
READ ALSO : Fire Blight : యాసంగి వరిలో అగ్గితెగులు నివారణ చర్యలు!
నెల్లూరు జిల్లాలో వరి సాగయ్యే స్థితిగతులు ప్రత్యేకం. తీవ్రమైన ఎండల్లో అంటే ఏప్రెల్ మే నెలల్లో ఇక్కడ నాట్లు వేస్తారు. వర్షాకాలంలో కోతలు పూర్తి చేస్తారు. పూర్తిగా భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇక్కడ వరిసాగు కొనసాగుతుంది. త్వరగా కోతకు వచ్చే స్వల్పకాలిక రకాలను అధికంగా సాగుచేస్తారు.
ప్రస్థుతం నీరు నిల్వవున్న భూముల్లోను, మురుగునీటి పారుదల సదుపాయం లేని పొలాల్లో చీడపీడల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాముపొడ తెగులు, పొట్టకుళ్లు తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా.ఐ. పరమశివ.
READ ALSO : Paddy : వరిపైరులో చీడపీడల సస్యరక్షణ
ఎడగారు వరిలో పురుగుల బెడద తక్కువ వుంటుంది. అయితే వర్షాలు అధికంగా వున్నప్పుడు సుడిదోమ తీవ్రంగా నష్టం కలిగించే ప్రమాధం వుంది. ఈ దోమ ఉధృతి గమనించటం ఏమాత్రం ఆలస్యమైనా పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది.