Paddy : వరిపైరులో చీడపీడల సస్యరక్షణ

నాటు వేసే ముందు ప్రతి 2మీ 20సెం.మీ.కు ఖాళీ బాటలు తీయాలి. మొగి పురుగు, ఆకుముడత లాంటి పురుగుల ఉనికిని తెలుసుకోవటానికి ప్రధాన పొలంలో ఎకరాకు 4లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి.

Paddy : వరిపైరులో చీడపీడల సస్యరక్షణ

Paddy

Paddy : తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైనది. వరిలో అధిక దిగుబడి సాధించటానికి సమగ్ర యాజమాన్య పద్దతులు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వరి పైరును అశించిన పురుగులు, తెగుళ్ళపై అవగాహన పెంచుకోవాలి. ఈ చీడపీడలు దిగుబడిపై ప్రభావం చూపించటమే కాకుండా పంట నాణ్యతను దెబ్బతీస్తాయి. రైతులు వరి పైరు సాగులో కొన్ని జాగ్రత్తలను పాటించటం తప్పనిసరి. చీడపీడల విషయంలో సకాలంలో చర్యలు చేపడితే మంచి పంట దిగుబడిని సాధించవచ్చు.

వరిపంటను ఆశించే పురుగులు, తెగుళ్ళు ;

ప్రధానంగా వరిపంటను ఆశించే పురుగులు, తెగుళ్ళ విషయానికి వస్తే ఉల్లి కోడు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత, తాటాకు తెగులు, వరి ఈగ, సుడిదోమ, కంకినల్లి, ఆకునల్లి, రెల్ల రాల్చు పురుగు, కంపునల్లి వంటి పురుగుల బెడద అధికంగా ఉంటుంది. తెగుళ్ళకు సంబంధించి అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు, పాముపొడ తెగులు, బ్యాక్టీరియా ఎండు తెగులు, కాండం కుళ్ళు తెగులు, పొట్టకుళ్ళు తెగులు, మాని పండు తెగులు వీటితోపాటు ఇతర తెగుళ్ళు, పురుగులు వరి పంటను ఆశించి నష్టం కలుగ జేస్తాయి. వీటిని తొలిదశలోనే గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

సస్యరక్షణ పద్దతులు ;

పురుగులు , తెగుళ్ళను తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేపట్టాలి. విత్తన శుద్ధి తప్పకుండా పాటించాలి. 1కిలో విత్తనానికి 1గ్రా కార్బండిజమ్, లేదా 3గ్రా 1కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ది చేయాలి. పంట కోసిన వెంటనే పంట అవవశేషాలు లేకుండా చూసుకోవాలి. నారుమడిలో సస్యరక్షణ చర్యలు పాటించాలి. నారు మడిలో విత్తిన 7 నుండి 10 రోజుల్లో, నారు పీకటానికి 10 రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి.

నాటు వేసే ముందు ప్రతి 2మీ 20సెం.మీ.కు ఖాళీ బాటలు తీయాలి. మొగి పురుగు, ఆకుముడత లాంటి పురుగుల ఉనికిని తెలుసుకోవటానికి ప్రధాన పొలంలో ఎకరాకు 4లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. కీడు చేసే మిత్రపురుగులు ఉన్న ఎడల మిత్ర పురుగులకు హాని జరగకుండా పురుగు మందులు పిచికారి చేయాలి. కొన్ని రకాల చీడ పీడలు ముఖ్యంగా దోమ కాండం కుళ్ళు వంటి వాటిని నివారించేందుకు పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెడుతూ నీటి తడులివ్వాల్సి ఉంటుంది. పొలాన్ని వీలైనంత నేలకు దగ్గరగా కోయాలి. తద్వారా మొగిపురుగు సమర్ధవంతంగా నివారించవచ్చు.

ఎకరాకు 20వేల చొప్పున నాటిన 30 నుండి 45 రోజులకు 3సార్లు ట్రైకోగ్రామా పరాన్న జీవులను విడుదల చేయాలి. పొలం గట్లపై పొలంలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడూ తగు జాగ్రత్తలు వహించాలి. ఎరువులను సమపాళ్ళలో వాడాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును సిఫారుసు మేరకు దఫదఫాలుగా వేయాలి. అప్పటికీ పురుగుల బెడద కనిపిస్తే మాత్రమే వ్యవసాయ అధికారులు సూచనల మేరకు పురుగు మందులు వినియోగించాలి.