Honey Bee Training : తేనెటీగల పెంపకంలో శిక్షణ.. స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకం

Honey Bee Training : ఇందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం. మార్కెట్‌లో అధిక డిమాండ్‌ పలుకుతూ, తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈపరిశ్రమను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

Honey Bee Training : ఒకప్పుడు అడవుల్లో, భారీ చెట్ల వద్ద మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతున్నది. తేనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని తేనెటీగల పెంపకం ద్వారా వస్తుండటంతో రైతులు, చదువుకున్న యువత, ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే తేనెటీగల పెంపకంలో శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులను వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా పెంపొందించుకోవాలి. ఎప్పుడు ఒకే పంటపై ఆధార పడటం.. అటు వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు రాకపోవడం జరుగుతుంటుంది. అయితే అనుబంధరంగాలను చేపడితే ఒక దాంట్లో కాకపోయినా.. మరో దాని నుండి స్థిరమైన ఆదాయం పొందవచ్చు.  ఇందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం. మార్కెట్‌లో అధిక డిమాండ్‌ పలుకుతూ, తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈపరిశ్రమను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

ఇందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెపంకంపై రైతులు, నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. బాక్సుల్లో బీ కీపింగ్‌ చేస్తూ వాటిని రైతులకు చూపిస్తూ తేనె ఎలా తయారుచేయవచ్చో అర్థమయ్యేలా వివరిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఆదాయాన్ని పొందడమే కాకుండా పరిసరాలలో ఉన్న వివిధ పంటల దిగుబడులు కూడా 3 నుండి 30% వరకు పెరుగుతాయి.

భూమిలేని నిరుపేదలు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి కల్పించే తేనె పరిశ్రమలో లాభాలకు కొదవలేదు. ఏడాది పొడవునా తేనే ఉత్పత్తి ఉండటం, ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఈ పరిశ్రమ చేపట్టాలనుకునే వారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం లో సంప్రదించి ఉచితంగా తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందవచ్చు.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

ట్రెండింగ్ వార్తలు