Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

మల్చింగ్‌ బిందు సేద్యంతో కలిపి వేయడం వలన సాంప్రదాయ యాజమాన్య పద్ధతులతో పోలిస్తే, ఈ పద్ధతిలో వేసిన ఎరువును మొక్క పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతుంది.

Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

Agriculture with Mulching

Agriculture with Mulching : వ్యవసాయం రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఇటీ వలి కాలంలో ప్లాస్టిక్ మల్చింగ్ ప్రక్రియలో రైతులు సాగు చేపడుతున్నారు. మల్చి ప్రక్రియలో ప్రస్తుతం రైతులు రెండు విధానాలను అనుసరిస్తున్నారు. వాటిలో ప్లాస్టిక్ మల్చింగ్ ఒకటైతే, రెండోది సహజ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా పంటపొలంలో కలుపు నివారణ, భూమిలో తేమ శాతాన్ని కాపాడుకోవటానికి, పోషక విలువల యాజమాన్యానికి ప్లాస్టిక్ మల్చింగ్ తోడ్పడుతుంది.

READ ALSO : Organic Farming : రైతు ఇంట ప్రకృతి పంట.. విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం

ప్లాస్టిక్‌ మల్చింగ్‌ ప్రయోజనాలు ;

1. నీటి పొదుపు : బిందు సేద్య పద్ధతితో కలిపి మల్చింగ్‌ను వినియోగించడం వలన మొక్క చుట్టూ ఉండే తేమను అవిరికాకుండా నివారించి, 30-70% వరకు నీరు ఆదా చేస్తుంది.

2. కలుపు నివారణ : మల్చింగ్‌ విధానం వలన సూర్యరళ్మిని నేరుగా. కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కలుపు నివారణ అవుతుంది.

READ ALSO : Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే లాభాలు

3. అన్నివేళలా విత్తనం నాటుకోవచ్చు : ప్లాస్టిక్‌ మల్చ్‌లు భూమి శీతోష్టస్థితిలో మార్పులకు గురిచేస్తాయి. భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచే స్వభావం. కలిగి ఉంటాయి. దీనివలన సాగు త్వరగా ప్రారంభమై పంటకూడా త్వరగా వస్తుంది. తెల్లని మల్చ్‌ భూమి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. మండు వేసవిలో కూడా భూమి ఉష్ణోగ్రత నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

4. ఎరువుల వాడకం తగ్గుదల : మల్చింగ్‌ బిందు సేద్యంతో కలిపి వేయడం వలన సాంప్రదాయ యాజమాన్య పద్ధతులతో పోలిస్తే, ఈ పద్ధతిలో వేసిన ఎరువును మొక్క పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతుంది.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

5.భూసార సంరక్షణ : మల్చింగ్‌ విధానం వలన వర్షపు నీరు నేరుగా భూమిపై పదకుండా నివారించడం వలన మట్టికోతను అడ్డుకుని, తద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు.

6. నేల ఉష్ణోగ్రత నియంత్రణ : మొక్క వేళ్ళ చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలుగ చేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించే అవకాశం మల్చింగ్‌ వలన ఏర్పడుతుంది.

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

7. భూమిలో చీడపీడల నివారణ : పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచడం ద్వారా భూమిలోకి సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడం ద్వారా, భూమిలోని క్రిమికీటకాదులు, తెగులు కారక సూక్ష్మజీవులు నశిస్తాయి.

8. పంట నాణ్యతను పెంచుతుంది : చెట్టుకు కాసిన కాయకు మట్టితో నేరుగా సంబంధం లేకపోవడం వలన కాయ యొక్క నాణ్యత మెరుగుపడుతుంది. వివిధ రంగులతో కూడిన మల్చ్‌లు వాడటంతో కాయ సైజు, నాణ్యత పెరిగి, మంచి రంగుతో అభివృద్ధిచెందుతాయి.