Maize Cultivation
Maize Cultivation : నేలను దుక్కిదున్నకుండా, పంటలను సాగు చేసే పద్దతిని జీరోటిల్లేజ్ అంటారు. రబీ కాలంలో మొక్కజొన్నను జీరోటిల్లేజ్ పద్ధతిలో సాగుచేయటం గత 15 సంవత్సరాలుగా ఆచరణలో వుంది. ఈ విధానంలో రైతుకు సాగు ఖర్చు తగ్గటమేకాకుండా, పంటకాలం కలిసివస్తుంది. సాధారణ పద్దతికి దీటుగా దిగుబడి సాధించవచ్చు. సాగు వివరాలను శాస్త్రవేత్త డా. శ్రీలత ద్వారా తెలుసుకుందాం.
READ ALSO : Corn Farming : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్నని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా జీరోటిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు ఇటీవల కాలంలో పద్ధతి రైతుల్లో ప్రాచుర్యం పొందుతోంది.
ఈ పద్ధతిలో తొలకరి వరిచేను కోసిన తరువాత , పొలంలో వరికొయ్యకాల్లో దుక్కిదున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి దున్నే ఖర్చులు ఆదా అవుతాయి. అంతే కాకుండా నెలరోజుల పంటకాలం కలిసి వస్తోంది. తెలంగాణలో నవంబర్ నుండి డిసెంబర్ వరకు సాగుచేసుకునే అవకావం ఉండేది . ఇటు కోస్తా జిల్లాల్లో నవంబర్ నుండి జనవరి వరకు సాగుచేసుకోవచ్చు. మరి ఆసాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
READ ALSO : Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు
జిరోటిల్లేజ్ సాగు విధానంలో కలుపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్నను విత్తని 24 గంటలంలొను కలుపు నివారణకు కలుపు మందులను పిచికారిచేయాలి. తర్వాత పంట కోసే వరకు ఎలాంటి అంతర కృషి అవసరం లేదు. సాధారణంగా రబీ మొక్కజొన్న పంటకు ఆచరించినట్లుగానే వరిమాగాణుల్లో సాగుచేసిన మొక్కజొన్నకు ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి.
మొక్కజొన్న పూతకు ముందు పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలో నీరు తప్పని సరి అవసరం. ముఖ్యంగా మొక్కజొన్న అధిక తేమను, అధిక బెట్టను తట్టుకోలేదు. ఇది గుర్తించి రైతులు సరైన సమయంలో సరైన విధంగా నీటితడులను అందించినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చు. మొక్క తొలిదశలోనే గులాబిరంగు కాండం తోలుచు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుండగా, ఇటీవల కత్తెరపురుగు ఉధృతి పెరిగి పంటను కోలుకోలేకుండా చేస్తోంది. సకాలంలో వీటి ఉధృతి గుర్తించి అరికట్టకపోతే దిగుబడులు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉంది.
READ ALSO : Maize Crop : మొక్కజొన్నకు చీడపీడల బెడద.. నివారణ చర్యలకు శాస్త్రవేత్తల సూచనలు
జీరోటిల్లేజ్ సాగు ద్వారా పొలం దున్నే ఖర్చు, సమయాన్ని తగ్గించవచ్చు. నేల స్వభావాన్నిబట్టి 2 నుండి 4 నీటి తడులను ఆదా చేసుకోవచ్చు. అంతర కృషి చేయాల్సిన పని లేదు. 10 నుండి 15 రోజల ముందు కోతకొస్తుంది. వరి కోయకాలు భూమిపై పర్చుకొని కలుపును తగ్గించడమే కాకుండా తేమ తొందరగా ఆరిపోకుండా ఉండి మొక్కకు నిరంతరం పోషక పదార్ధాలను అందించడం వల్ల దిగుబడులు పెరుగుతాయి.