Maize Cultivation : జీరో టిల్లేజి విధానంలో మొక్కజొన్నసాగు

ఈ విధానంలో తక్కువ కూలీలు, తక్కువ ఖర్చుతో పైర్లు సాగు వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. జీరో టిల్లేజి వ్యవసాయం కాకుండా నేలను దున్ని, మెత్తటి దుక్కి తయారు చేసుకొనిపైరు విత్తుకోవాలంటే సమయం వృధాఅవుతుంది.

Maize Cultivation

Maize Cultivation : మొక్కజొన్న పంట అన్ని నేలలో పండించేందుకు అనువైనది. మొక్కజొన్న ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకు గాను, పేలాలు, తీపికండే మరియు బేబీకార్న్ గా ఉపయోగిస్తారు. మొక్కజొన్న నీరు సమృద్ధిగా ఉంటె అన్ని కాలాలకు అనువైన పంట. ఖరీఫ్ పంటకన్నా రబీలో దీనిని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మొక్కజొన్న అధిక దిగుబడులకు నీటిని వినియోగం ఎక్కువగా ఉంటుంది.

READ ALSO : Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు

తెలగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలోనే రైతులు సాగు చేస్తున్నారు. అయితే సాధారణంగా పంట పూర్తయిన తరువాత పొలం దున్ని మొక్కజొన్న సాగును చేపడతారు. అయితే ప్రస్తుతం జీరో టిల్లేజి పద్దతిని రైతులు అనుసరిస్తున్నారు. పొలం దున్నకుండా పైర్లు విత్తుకొని, కలుపు నివారణకు కలుపు మందులు, ఇతర నివారణ పద్ధతులు ఆచరిస్తూ, రైతులు తమకు అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.

READ ALSO :  Maize Cultivation : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

ఈ విధానంలో తక్కువ కూలీలు, తక్కువ ఖర్చుతో పైర్లు సాగు వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. జీరో టిల్లేజి వ్యవసాయం కాకుండా నేలను దున్ని, మెత్తటి దుక్కి తయారు చేసుకొనిపైరు విత్తుకోవాలంటే సమయం వృధాఅవుతుంది. కొన్ని సందర్భాల్లో పంట సాగు చేయలేని పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది రైతులు తక్కువ ఖర్చులో అనువుగా ఉన్న జీరో టిల్లేజ్‌ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం వుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు

రబీ కాలంలో వరి సాగుకు సరిపడా నీరు అందుబాటులో లేకుంటే వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు, చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. మార్కెట్‌ ధర నికరంగా ఉండడం వంటి కారణాల వల్ల రైతులు మంచి ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది. వరసులకి మధ్య 60 సెం.మీ. మొక్కకి మొక్కకి మధ్య 20 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎకరానికి 80-96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను వేసుకోవాలి.