Mango Farming : పూత, పిందె దశలో మామిడి తోటలు.. చేపట్టాల్సిన యాజమాన్యం

Mango Farming : తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల  హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.

mango-farming-cultivation-and-techniques

Mango Farming : ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత, పిందె ప్రారంభమైంది.  మరికొన్నితోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సివుంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు పూత, పిందె సమయంలో పాటంచే యాజమాన్యం ఒకఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా  రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు  శాస్త్రవేత్త, జి. చిట్టిబాబు.

Read Also : Oil Farm Cultivation : పామాయిల్‌లో అంతర పంటలుగా బెండ, మొక్కజొన్న సాగు

పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల  హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు  అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.

పూత సమయంలో, కాయ పెరిగే దశలో చీడపీడలు :
అయితే మామిడి పూత దశలో ఆశించే పురుగుల్లో తేనే మంచు పురుగులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. వీటి వల్ల నష్టం ఎక్కువగా నవంబర్ నెల నుండి మార్చి నెల ఆఖరు వరకు ఉంటుంది. ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమయంలో మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు శాస్త్రవేత్త, జి. చిట్టిబాబు .

మామిడి కాయలను పక్వానికి వచ్చిన తర్వాత ఆలస్యంగా కోత కోసినట్లయితే పండుఈగ ఆశించి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ పురుగు యొక్క తల్లి ఈగలు ఎరుపు, గోధుమ రంగులో కలిగి శరీరంతో పసుపు పచ్చని చారలు కలిగి ఉండి, ఒకే జత రెక్కలతో  తోటలలో ఆకుల అడుగు భాగంలో ఎగురుతూ ఉంటాయి.

ఈ పండు ఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్లిపోయి రాలిపోయేలా చేస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల కాయలు తినటానికి గాని, గుజ్జు తీయడానికి గాని పనికిరాక ఎగుమతులకు కూడా ఉపయోగపడకుండాపోతాయి. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి, సరైన నీటియాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మండి దిగుబడులను తీయవచ్చు.

Read Also : Mango Farming Cultivation : మామిడి తోటల్లో పూత పురుగును అరికట్టే విధానం