Mango Farming Beginners : మామిడి తోటల్లో పూత యాజమాన్యం.. తొలిదశలోనే అరికట్టాలంటే?

Mango Farming Beginners : పండే మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఇక్కడ పండే మామిడి పండ్లు కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ కు ముందే దళారులు జిల్లాకు చేరుకొని, స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు.

Mango Farming Guide for Beginners

Mango Farming Beginners : ప్రతీ ఏటా  మామిడికి మంచు కష్టాలు తప్పడం లేదు. మామిడి తోటలను నమ్ముకునే రైతులకు ఉదయాన్నే కురిసే మంచుతో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి కలుగుతోంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. కొన్ని చోట్ల ఇంకా రాలేదు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విజయనగరం జిల్లా ఉద్యాన  శాఖాధికారులు అధికారులు.

Read Also : Crop Cultivation Techniques : 7 ఎకరాల్లో ఏడంచెల సాగు.. ఏడాది పొడవునా పంటల దిగుబడి

పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సుమారు 43 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. గడచిన కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ప్రభావంతో విస్తీర్ణం తగ్గినప్పటికీ, వ్యవసాయం చేయలేక చాలా మంది రైతులు తమ భూముల్లో ఉద్యాన తోటలను పెంచుతున్నారు. వీటిలో ప్రథమ స్థానం మామిడిదే. అయితే,  రైతులు సొంతంగా మామిడి తోటల నిర్వహణ చేపట్టడం చాలా తక్కువ. ఎక్కువ భాగం తోటలు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి వ్యాపారులతో పాటు, స్థానికంగా ఉన్న రైతులు, దళారులు సీజన్లో వచ్చి మామిడి తోటలను కౌలుకు తీసుకుంటుంటారు.

తొలిదశలోనే అరికట్టాలంటూన్న ఉద్యాన అధికారులు :
జిల్లాలో పండే మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఇక్కడ పండే మామిడి పండ్లు కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ కు ముందే దళారులు జిల్లాకు చేరుకొని, స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక అప్పటి నుంచి సీజన్ ముగిసే వరకు ఇక్కడే తిష్టవేసి మామిడి రవాణాను కొనసాగిస్తారు. బంగినపల్లి, సువర్ణరేక, కలెక్టరు, పణుకులు వంటి రకాలు ఇక్కడ అధికంగా సాగుచేస్తారు. అయితే, జిల్లాలో ఈ ఏఢాది మామిడి పూత ఊరించి… ఊసూరుమనిపిస్తోంది. ఉదయం వేళల్లో తీవ్రంగా కురుస్తున్న పొగమంచు, పగలు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఎండలు కారణంగా మామిడి తోటలు పూత దశలోనే విపరీతమైన తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా మామిడి రైతులకు అపారనష్టాలను తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం జిల్లాలో కొన్ని రకాలకు చెందిన మామిడి పూతదశ ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి పూర్తిస్థాయిలో పూత పూసి, పిందె దశలకు చేరుతుంది. ఈ సమయంలోనే రైతులు సస్యరక్షణపై అధికంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ సమయంలో మామిడికి తేనెమంచు పురుగు ఆశిస్తుంది. ఈ తేనెమంచు పురుగు ఆకులు, పువ్వు, మొగ్గలపై అధికంగా ప్రభావం చూపుతుంది. ఈ తేనెమంచు పురుగు జిగురు వంటి పదార్థాన్ని వెదజల్లుంది.

తీపిగా ఉండే ఈ జిగురు పదార్థాన్ని తినేందుకు చీమలు ఇష్టపడుతుంటాయి. అలాగే, దీనిపై బూడిద వంటి పదార్థం కూడా వ్యాపించడంతో క్రమంగా పువ్వు, మొగ్గలు, పిందెలు మాడిపోయి, రాలిపోతుంది. ఈ తేనెమంచు పురుగు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పురుగును నివారించడానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి, సరైన నీటియాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మండి దిగుబడులను తీయవచ్చు.

Read Also : Sesame Cultivation : నువ్వుల సాగుపై జగిత్యాల పరిశోధనా స్థానాల అధ్వర్యంలో కిసాన్ మేళా