Sesame Cultivation : నువ్వుల సాగుపై జగిత్యాల పరిశోధనా స్థానాల అధ్వర్యంలో కిసాన్ మేళా

Kissan Mela : పాత రోజుల్లో ప్రతి కుటుంబానికి సరిపడా నూనె గింజలు, పప్పు దినుసులు, అనేక ఆహార ధ్యానపు పంటలను పండించుకొనే వారని గుర్తు చేశారు.

Sesame Cultivation : నువ్వుల సాగుపై జగిత్యాల పరిశోధనా స్థానాల అధ్వర్యంలో కిసాన్ మేళా

Kissan Mela

Kisan Mela on Sesame Cultivation : వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, అధికమవుతున్న కూలీల సమస్యలను  అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపట్ల అవగాహన కల్పించేందుకు  రైతులకు తెలియజేసేందుకు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో కిసాన్‌ మేళా నిర్వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత నూనెగింజల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో నువ్వుల సాగుచేపట్టాలని సూచించారు.

Read Also : Wheat Cultivation : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి, తెగుళ్ల నివారణ

శరవేగంగా విస్తరిస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో .. జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో ఇటీవల కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో స్టాళ్లు ఏర్పాటు చేసి అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, యాంత్రీకరణ ప్రదర్శించారు.  ఉత్తర తెలంగాణ ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.. తరచు ఒకే పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటగా నూనె గింజ పంటలను సాగు చేపట్టాలని శాస్ర్తవేత్తలు రైతులకు సూచించారు.

రైతులు వ్యాపారులుగా మారినప్పుడే ఆదాయాన్ని పెంచుకోగలుగుతారని, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. పాత రోజుల్లో ప్రతి కుటుంబానికి సరిపడా నూనె గింజలు, పప్పు దినుసులు, అనేక ఆహార ధ్యానపు పంటలను పండించుకొనే వారని గుర్తు చేశారు.

మళ్లీ పాత కాలం రోజులు రావాలని, రైతులు సమగ్ర వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రూ.కోట్లు పెట్టి నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నామన్నారు. ఎప్పుడు ఒకే పంట వేయకుండా నువ్వుల లాంటి పంటలను వేసుకోవాలని సూచించారు. అయితే నువ్వులను ఎగుమతి చేయడానికి కొన్ని దేశాల్లో కొన్ని రకాల స్టాండట్స్‌ ఉన్నాయని, అందుకనుగుణంగా ఉత్పత్తి చేసినప్పుడే కొనుగోలు చేస్తారని తెలిపారు.

నువ్వుల సాగు చేపట్టేందుకు తాము సిద్ధమేనని… అయితే ప్రభుత్వం ఒక మద్దతు ధర కల్పించాలని రైతులు ఈ సందర్శంగా కోరారు.. తాము అమ్మే సమయంలో ధరలు తగ్గుతున్నాయని.. తరువాత  పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం ధరలు విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also : Crop Cultivation Techniques : 7 ఎకరాల్లో ఏడంచెల సాగు.. ఏడాది పొడవునా పంటల దిగుబడి