Wheat Cultivation : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి, తెగుళ్ల నివారణ

Wheat Cultivation : సాధారణంగా గోధుమను అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ చివరి వరకు విత్తుకుంటారు. అయితే అలస్యంగా నాటే రైతులు మాత్రం విత్తన మోతాదు పెంచుకోవాల్సి ఉంటుంది.

Wheat Cultivation : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి, తెగుళ్ల నివారణ

Prevention of Pests in Wheat Cultivation

Prevention of Pests in Wheat Cultivation : చలికాలంలో మాత్రమే వచ్చే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారత దేశంలో సాగుచేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలో గోధుమను సాగుచేయటం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తిసాగుచేస్తారు. ఇప్పటికే విత్తన గోదుమ ఎదుగుదల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వలన గోదుమలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం..

బూడిద తెగులు నివారణ : 
తెలంగాణలో గొధుమ పంట విస్తీర్ణం చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు, మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్లన ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ గోధుమ పంట తెలంగాణలోని మెదక్‌, ఆదిలాబాద్‌ ,నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు.

సాధారణంగా గోధుమను అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ చివరి వరకు విత్తుకుంటారు. అయితే అలస్యంగా నాటే రైతులు మాత్రం విత్తన మోతాదు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో వేసిన గోధుమ 25 నుండి 35 రోజుల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా గోదుమ పంటలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియజేస్తున్నారు.