IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. మ‌రోసారి గాయ‌ప‌డ్డ రిష‌బ్ పంత్..

ద‌క్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు (IND vs SA)భారీ షాక్ త‌గిలింది.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. మ‌రోసారి గాయ‌ప‌డ్డ రిష‌బ్ పంత్..

Big shock to Team India Rishabh Pant retires hurt during second unofficial Test against South Africa A

Updated On : November 8, 2025 / 12:54 PM IST

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. భార‌త స్టార్ వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ మ‌రోసారి గాయ‌ప‌డ్డాడు. ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్టుతో జ‌రుగుతున్న అన‌ధికారిక‌ రెండో టెస్టు మ్యాచ్‌లో పంత్ రిటైర్డ్ హ‌ర్ట్‌గా మైదానాన్ని వీడాడు.

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో భార‌త్‌-ఏ, ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్లు అన‌ధికారిక రెండో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్‌-ఏ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సంద‌ర్భంగా రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ్డాడు. ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ షెపో మోరేకి బౌలింగ్‌లో బంతి మూడు సార్లు పంత్ శ‌రీరాన్ని తాకింది.

IND vs AUS : ఐదో టీ20 మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు..! ర‌ద్దు అయితే ఎవ‌రికి లాభ‌మో తెలుసా?

తొలిసారి రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా బంతి పంత్ హెల్మెట్‌ను తాకింది. రెండవసారి లెగ్-సైడ్ పుల్ చేయడానికి ప్రయత్నిస్తుండగా బంతి అతని మోచేయిని తాకింది. ఆ త‌రువాత బంతి మ‌రోసారి అత‌డిని తాకింది. దీంతో పంత్ నొప్పితో విల‌విల‌లాడాడు.

ఫిజియో వ‌చ్చి ప్రాథ‌మిక చికిత్స అందించాడు. అయితే.. నొప్పి ఇబ్బంది పెడుతుండ‌డం, త్వ‌ర‌లో ద‌క్షిణాప్రికాతో టెస్టు సిరీస్ ఉండ‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా పంత్ వ్య‌క్తిగ‌త స్కోరు 17 ప‌రుగుల వ‌ద్ద రిటైర్డ్ హ‌ర్ట్‌గా మైదానాన్ని వీడాడు.

Hong Kong Sixes 2025 : దినేశ్ కార్తీక్ ఎంత ప‌ని చేశావ‌య్యా.. ప‌సికూనలు కువైట్, యూఏఈ చేతిలో ఘోర ప‌రాభ‌వం.. టోర్నీ నుంచి భార‌త్ ఔట్‌..

ఒక వేళ పంత్ గాయం తీవ్ర‌మైన‌ది అయి అత‌డు న‌వంబ‌ర్ 14 నుంచి ద‌క్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరం అయితే అది భార‌త జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో గాయం..

జూలైలో ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగో టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ రిష‌బ్ పంత్ గాయ‌పడిన సంగ‌తి తెలిసిందే. బంతిని రివర్స్ స్వీప్ చేసే క్ర‌మంలో పంత్ కాలికి గాయ‌మైంది. దీంతో అత‌డు దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నాడు. ఈ క్ర‌మంలో భార‌త్‌-ఏ జ‌ట్టు కెప్టెన్‌గా ద‌క్షిణాఫ్రికా-ఏతో జ‌రుగుతున్న రెండు మ్యాచ్‌ల అన‌ధికారిక టెస్టు సిరీస్‌లో పంత్ పాల్గొన్నాడు.