IND vs AUS : ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు..! రద్దు అయితే ఎవరికి లాభమో తెలుసా?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు (IND vs AUS) ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.
IND vs AUS 5th T20 Will rain play spoilsport in series decider
IND vs AUS : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో దాదాపు 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది.
ఇక ఆక్యువెదర్ ప్రకారం స్థానిక కాలమానం (బిస్బేన్) సాయంత్రం 6 గంటలకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా మ్యాచ్ జరిగే సమయంలో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించవచ్చునని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటుందని వెల్లడించింది. ఇక వాతావరణం మేఘావృతమై ఉంటుందని చెప్పింది.
మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.15 గంటలకు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 కు ప్రారంభం కానుంది.
మ్యాచ్ రద్దు అయితే..
ఈ సిరీస్‌లో ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించగా.. వరుసగా మూడు, నాలుగో టీ20 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. ప్రస్తుతానికి భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. అప్పుడు భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
5వ టీ20మ్యాచ్‌కు స్క్వాడ్స్ ఇవే..
భారత్.. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా
ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మహ్లి బియర్డ్‌మాన్.
