Ration Cards : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇదే చివరి చాన్స్.. రేషన్ కార్డులు రద్దవుతాయ్.. వెంటనే ఇలా చేయండి..
Ration Cards : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు చివరి అవకాశం ఇచ్చింది.
Ration Cards
Ration Cards : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు చివరి అవకాశం ఇచ్చింది. నవంబర్ చివరి నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. ఆ తరువాత ఈకేవైసీ లేని కార్డులను రద్దు చేస్తామని పేర్కొంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రేషన్ షాపుల పరిధిలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. అయితే, ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. రేషన్ కార్డులు ఉన్నవారు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని, లేకుంటే డిసెంబర్ నెల నుంచి కార్డులను రద్దు చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం, పప్పులు, నూనె వంటి వస్తువులను అందిస్తోంది. వీటితోపాటు ఈ కార్డు ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తోంది. వీటన్నింటికీ కీలకమైన రేషన్ కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే ప్రతిఒక్క సభ్యులు ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
రేషన్ కార్డులో సభ్యుల్లో చాలా మంది ఈ కేవైసీ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు ఈకేవైసీ గురించి ప్రజలను అప్రమత్తం చేసింది. అయినా, ఇంకా లక్షల మంది ఈకేవైసీ చేయించుకోలేదు. వారందరికీ మరో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. నవంబర్ చివరి నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. వాస్తవానికి.. అక్టోబర్ ఆఖరి కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది.. గుడువు ముగిసి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు లక్షల కార్డులకు ఈకేవైసీ కాలేదు. అందుకే చివరి ఛాన్స్ గా ఇప్పుడు మరోసారి గడువు పెంచారు.
రేషన్ కార్డులో ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నవారు.. మీ పరిధిలోని రేషన్ డీలరు దగ్గరకు వెళ్లి జస్ట్ ఈ-పోస్‌లో కార్డుదారులు ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఆ వెంటనే రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ డీలర్ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. డిసెంబర్ నెల నుంచి రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతిఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
