×
Ad

Mango Pest Disease : మామిడిలో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ

Mango pest disease management : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి.

  • Published On : December 24, 2023 / 03:23 PM IST

Mango pest disease management

Mango pest disease management : చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఇంకా పూత ప్రారంభం కాలేదు.  సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు పూత సమయంలో పాటంచే యాజమాన్యం ఒకఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా  రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే మంచి దిగుబడులను తీయవచ్చని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు.

మామిడితోటల్లో పూత – ఆశించే చీడపీడల నివారణ చర్యలు : 
పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు  అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో , కాయ పెరిగే దశలో పురుగులు తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. శ్రవంతి.

తేనెమంచు పురుగుల నివారణ :
ఇమిడాక్లోప్రిడ్ 18.7 ఎస్.ఎల్ 0.3 మి. లీ. వేపనూనె( అజాడిరక్టిన్ 1000 పిపిఎం) 1 మి. లీ. కార్బండిజమ్ 1 గ్రా. స్టిక్కర్ 0.5 మి. లీ.

తేనెమంచు పురుగుల నివారణ :
థయామిథాక్సామ్ 25 జిజి 0.3 గ్రా.  లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

తేనెమంచు పురుగుల నివారణ :
కార్బండిజమ్ + మ్యాంకోజెబ్ 2 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

తేనెమంచు పురుగుల నివారణ : 
స్టిక్కర్ 0.5 మి. లీ. వేపనూనె (అజాడిరక్టిన్ 1000 పిపిఎం) 1 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

బూడిదతెగులు నివారణ :
నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 1.5 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

తామర పురుగుల నివారణ : 
ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మి. లీ. వేపనూనె
(అజాడిరక్టిన్ 1000 పిపిఎం) 1 మి. లీ.
స్టిక్కర్ 0.5 మి. లీ. లీటరు నీటికి కలిపి

తామర పురుగుల నివారణ :
ఫిప్రోనిల్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

మచ్చల నివారణ :
కార్బండిజమ్ + మ్యాంకోజెబ్ 2 గ్రా. స్టిక్కర్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

మామిడిలో ఆశించే పురుగులు : 
కాయతొలుచు పురుగు, గోనె గొంగలి పురుగు
పూత తినే గొంగలి పురుగు పూతలోనే గూడు కట్టుకునే పురుగు

పూత తినే గొంగలి పురుగుల నివారణ :
ఇమిమెక్టిమ్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా  స్ఫైనోశాడ్ 0.35 మి. లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

కాయతొలిచే పురుగు నివారణ : 
ఎకరాకు మెర్క్యూరివేపర్ లైట్ ట్రాప్ 1 ఏర్పాటు చేసుకోవాలి

కాయతొలిచే పురుగు నివారణ : 
అజాడిరక్టిన్ 1000 పిపిఎం 1 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

కాయతొలిచే పురుగు నివారణ : 
బిటి 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

పండుఈగ నివారణ : 
మలాథియాన్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి