Method of Preventing Nesting in Mango Farming
Mango Farming : ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్నితోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సివుంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు పూత సమయంలో పాటంచే యాజమాన్యం ఒకఎత్తు.
ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పూత ప్రారంభమయ్యే ఈ సమయంలో ఆకు జల్లెడ గూడు పురుగు ఆశించింది దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వెంకటరెడ్డి.
Read Also : Paddy Cultivation : రబీ వరిలో చీడపీడల నివారణ పద్ధతులు
పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.
అయితే పూత సమయంలో , కాయ పెరిగే దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో గూడు పరుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో నివారించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి గూరు పురుగును గుర్తించిన వెంటనే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. వెంకటరెడ్డి.
మామిడిసాగు తెలగు రాష్ట్రాల్లో
5 లక్షల 8 వేల హెక్టార్లలో
గూడుపురుగు నివారణ
మామిడి చెట్లపై ఉన్న
గూళ్లను తీసివేసి నాశనం చేయాలి
క్లోరిపైరిఫాస్ 2.5 మి. లీ లేదా
లామ్డాసైహలోత్రిన్ 5% ఈసి 1 మి. లీ లేదా
ఎసిఫేట్ 1.5 గ్రా.
మార్చుకొని పిచికారి చేయాలి
పురుగుల ఉధృతి అధికంగా ఉంటే
డైక్లోరోవాస్ ( నువాన్ ) 1 మి.లీ
లీటరు నీటికి కలిపి
పిచికారి చేయాలి
Read Also : Paddy Cultivation : రబీ వరి నారుమడులలో చేపట్టాల్సిన యాజమాన్యం