Rat Damage Control in Paddy
Rat Damage Control in Paddy : ఖరీఫ్ వచ్చేసింది. వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు నార్లు పోస్తున్నారు. అయితే కాలువల కింద వరి సాగయ్యే ప్రాంతాల్లో చీడపీడలతో పాటు ఎలుకలు సమస్య కూడా అధికంగా ఉంది. నారుమడుల నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే , ఎలుకలను అరికట్టి, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే రైతులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్.
READ ALSO : Export of Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వాసి
ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో వేసే ప్రధాన పంట వరి. ప్రసుత్తం ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు రైతులు. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో వరిని సాగుచేస్తూ ఉంటారు. అయితే కాలువలు , బావుల కింద కొన్ని చోట్ల ఎలుకల ఉధృతి అధికంగా ఉంటుంది. నారుమడి దశ నుండి పంట కోత వరకు ఇవి తీవ్రనష్టం కలిగిస్తూ ఉంటాయి.
READ ALSO : Sugarcane Cultivation : ఉత్తర కోస్తాకు అనువైన నూతన చెరకు రకాలు
వీటి సంతాన వృద్ధి ఎంత వేగంగా వుంటుందంటే ఒక జత ఎలుకలు సంవత్సరానికి 400-600 ఎలుకలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని పట్టించటానికి, రైతు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. కాబట్టి రైతులు ముందస్తూ మేలైన యాజమాన్య చర్యలు చేపడితే ఎలుకల నివారణ చేపట్టవచ్చిని తెలియజేస్తున్నారు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్