Sugarcane Cultivation : ఉత్తర కోస్తాకు అనువైన నూతన చెరకు రకాలు
ఖరీఫ్ లో వర్షాధారంగా ఇక్కడి రైతులు చెరకును సాగుచేస్తూ ఉంటారు. చెరకు దీర్ఘకాలిక పంట కావడం, పాతరకాలనే సాగుచేయడం, మరోవైపు పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో చాలా వరకు చెరకు సాగును వదిలేస్తున్నారు రైతులు.

Sugarcane Cultivation
Sugarcane Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4లక్షల 72వేల ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నారు. ప్రస్థుతం వర్షాధారంగా చెరకు నాటే సమయం ఆసన్నమయ్యింది. చెరకుసాగులో రైతు ఏడాదికాలంపాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి వుంది. కనుక నాటే సమయంలో విత్తనం ఎంపిక, నాటు పద్ధతిలో తగిన మెళకువలు పాటించినట్లైతే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. వి. గౌరి ద్వారా తెలుసుకుందాం..
READ ALSO : Sugarcane Cultivation : చెరకు సాగులో మెళకువలు
తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3 లక్షల 74వేల ఎకరాల్లో సాగువుతుండగా, తెలంగాణలో లక్షా 25 వేల ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం వుంది. ముఖ్యంగా ఏపిలో ఉత్తరకోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లో చెరకు ప్రధాన వాణిజ్యపంట. ఈ జిల్లాల్లో వరి పంట తరువాత చెరకు పంటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు బెల్లం తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఇక్కడ అభివృద్ధి చెందింది.
READ ALSO : Sugarcane Farming : చెరకు సాగులో ఎరువుల యాజమాన్యం
ఖరీఫ్ లో వర్షాధారంగా ఇక్కడి రైతులు చెరకును సాగుచేస్తూ ఉంటారు. చెరకు దీర్ఘకాలిక పంట కావడం, పాతరకాలనే సాగుచేయడం, మరోవైపు పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో చాలా వరకు చెరకు సాగును వదిలేస్తున్నారు రైతులు. అయితే తక్కువ పెట్టుబడితో, అధిక దిగుబడులను ఇచ్చే రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొద్ది పాటి యాజమాన్య పద్ధతులు పాటించి వీటిని సాగుచేస్తే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు.. విశాఖ జిల్లా , కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. వి. గౌరి.
READ ALSO : Benefits Of Mulching : వ్యవసాయ సాగులో మల్చింగ్ ప్రాధాన్యత, కలిగే లాభాలు
నేటికి చాలామంది రైతులుపాత రకాలనే సాగుచేస్తున్నారు. వాటిలో తెగుళ్లను తట్టుకునే శక్తి నశించి, దిగుబడి కూడా తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు రైతులు ఎంచుకొని, శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ.. సాగుచేస్తే.. అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుంది.