Red Gram Cotton Cultivation : మిగ్‌‌జామ్ తుఫాన్.. పత్తి, కందిలో చేపట్టాల్సిన యాజమాన్యం

Red Gram Cotton Cultivation : తుఫాన్ తో పంటలు నష్టపోకుండా రైతులు తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు

red Gram , Cotton Cultivation

Red Gram Cotton Cultivation : మిగ్‌ జామ్ తుఫాన్‌ ప్రభావంతో వాతావరణం మారింది. ఈదురు గాలులతో పాటు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. ఈ ప్రభావం ఉత్తర తెలంగాణలో పత్తి, కందిపంటలపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుఫాన్ తో పంటలు నష్టపోకుండా రైతులు తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Migjaum Effect on Crops : తెలుగు రాష్ట్రాల్లో పంటలపై ప్రభావం చూపిన మిగ్‌జామ్ తుఫాన్

రైతుల్లో మొదలైన తీవ్ర కలవరం..
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులను తుఫాన్‌ ఆందోళనకు గురి చేస్తున్నది. పంటలు చేతికొస్తున్న తరుణంలో మిగ్‌ జామ్  తుఫాన్‌ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతుల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి పంటలు కోత దశలో ఉండగా, కొన్ని చోట్ల కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు ఉన్నాయి.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూలీల కొరతతో  పత్తి మొక్కలపైనే ఉండగా.. మిరప కాత దశలో ఉన్నది. ఈ నేపథ్యంలో తుఫాన్‌తో పంటలు నష్టపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమగ్ర  యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సూచిస్తున్నారు.

ఖరీఫ్ లో విత్తిన కంది ప్రస్థుతం, పూత, కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. కీలకమైన ఈ దశలో ప్రధానంగా చీడపీడల బెడద అధికంగా వుంటుంది. 100 రోజుల పాటు శాకీయంగా అభివృద్ది చెందిన కందిలో పూత, పిందె దశ రెండు నెలలపాటు ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఆశించే చీడపీడలను సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు.

Read Also : Rabi Crops : వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు

ట్రెండింగ్ వార్తలు