Migjaum Effect on Crops : తెలుగు రాష్ట్రాల్లో పంటలపై ప్రభావం చూపిన మిగ్‌జామ్ తుఫాన్

Migjaum Cyclone Effect on Crops : తుఫాన్ ప్రభావంతో  రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరి, శనగ, కంది, మొక్కజొన్న, మినుము, మిరప, ప్రత్తి, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..

Migjaum Effect on Crops : తెలుగు రాష్ట్రాల్లో పంటలపై ప్రభావం చూపిన మిగ్‌జామ్ తుఫాన్

Migjaum Cyclone Effect on Crops

Migjaum Cyclone Effect on Crops : ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించింది. ఈ పెను తుపాను తీరం దాటక ముందు, దాటిన తర్వాత అదే రీతిలో విరుచుకుపడింది. ఏపీలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల్లో తుపాను ప్రభావం చూపింది. రైతుల ఆశలను అడియాసలు చేస్తూ పంటలను తుడిచిపెట్టేసింది. లక్షల ఎకరాల పంటలు నాశనమయ్యాయి. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. దీంతో, సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి మిగ్ జామ్ తుపాను ముంచుకొచ్చింది.

Read Also : Kharif Rice Cultivation : రబీకి అనువైన వరిరకాలు – నారుమడి యాజమాన్యం

ఈదురుగాలుల కారణంగా చేలల్లో ఉన్న పంట నెలకొరిగి, నీట మునిగింది. కోసిన పంట ధాన్యం రాశుల్లో ఉండగా వర్షపు నీటికి తడిసిముద్దయ్యింది. బస్తాలలో నిల్వ ఉంచిన ధాన్యం కూడా కొన్ని చోట్ల వరదల్లో చిక్కుకుపోయింది. తుఫాన్ ప్రభావంతో  రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరి, శనగ, కంది, మొక్కజొన్న, మినుము, మిరప, ప్రత్తి, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. శనగ, మినుము వేసిన పోల్లలో నీరు నిలవడంతో పూర్తి స్థాయి లో పంట నష్టం వాటిల్లింది. మరోవైపు ఉద్యాన పంటలైన పసుపు, పొగాకు, అరటి వంటి పంటలు దెబ్బతిన్నాయి.  ప్రభుత్వం స్పందించి తమకను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తెలంగాణపై  మిగ్‌జామ్ ప్రభావం.. దెబ్బతిన్న పత్తి, మిర్చి పంటలు :
ఇటు తెలంగాణపై  కూడా మిగ్ జామ్ ప్రభావం పడింది. వానలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.  జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరంగల్‌ జిల్లాలో 12 మండలాల్లో, ములుగు జిల్లాలో నాలుగు, భూపాలపల్లిలో మూడు, కుమురం భీం ఆసిఫాబాద్‌లో నాలుగు, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఆరేసి మండలాల్లో వరి పైర్లు నేలవాలగా.. పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కోసి ఉన్న వరి పైరుతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది.

ముఖ్యంగా… వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న,  వేరుశనగ పంటలపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది. అరటి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట… నేలకూలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రైతులందరికీ అండదండగా నిలవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఖరీఫ్‌ సీజన్‌లో 64 లక్షల ఎకరాల్లో వ్యవసాయం, 29  లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు.

ఇక 17 లక్షల  ఎకరాల్లో పంటల కోతలు పూర్తయ్యాయి. మరో 15 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మిగ్‌జామ్‌ తుఫాన్‌ కారణంగా… 80 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయని… కోతకు సిద్ధంగా ఉన్న లక్ష ఎకరాలకు పైగా పంట నేలకొరిగినట్టు ప్రాథమికంగా అంచనా చేశారు అధికారులు. అయితే… పూర్తిస్థాయిలో పంటనష్టం అంచనాలు సిద్ధం చేయాలని ప్రత్యేక బృందాలను పంపుతోంది ఏపీ ప్రభుత్వం.

Read Also : Onion Cultivation : ఉల్లి సాగుకు అనువైన నేలలు, చేపట్టాల్సిన యాజమాన్యపద్ధతులు !