Millets Rice
Millets Rice : ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అందుబాటులోకి చిరుధాన్యాల బియ్యం వస్తున్నాయి. ఇప్పటి వరకు బియ్యాన్ని ఇష్టంగా తింటూ.. మిల్లెట్స్ కూడా ఉండాలనుకునే వారికోసం.. మిల్లెట్ ఆధారిత బియ్యాన్ని తీసుకొస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ . ఇప్పటికే పరిశోధనలు పూర్తి చేసిన సంస్థ మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకరానుంది.
READ ALSO : Sorghum Cultivation : జొన్న సాగులో మేలైన యాజమాన్యం
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, ప్రధాన ఆహారమైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు.. కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి.
READ ALSO : పోషకాల లోపాన్ని నివారించే చిరుధాన్యాలు
ఈ నేపధ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే వీటిని పండించడం ఒక ఎత్తైతే.. వాటిని వండుకొని తినడం మరోఎత్తు. వరి అన్నం, గోధుమలతో చేసిన పదార్థాలను ఇష్టంగా తినే ప్రజలు చిరుధాన్యాలను తినాలనుకున్న తినలేకపోతున్నారు. ఇప్పుడు వారందరికోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ మిల్లెట్ ఆధారిత బియ్యాన్ని తయారు చేస్తోంది. ఇప్పటికే మిల్లెట్ దోస, ఇడ్లీ, పాస్తా, బిస్కెట్ లకు తీసుకొచ్చిన ఈ సంస్థ మరో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి మిల్లెట్ బియ్యాన్ని తీసుకొస్తుంది.
READ ALSO : Millets Cultivation : చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్న సబల
చిరుధాన్యాల లో ఉండే ప్రొటీన్లు విటమిన్లు, పీచు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా అవసరం. ప్రముఖ కంపెనీలు సైతం చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయంటే డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్థుతం వీటి వాడకం విస్తృతమైన నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తయారీ యూనిట్ లను మరింత విస్తరిస్తే, ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యే వీలుంది.