Mulberry Cultivation : కాసులు కురిపిస్తున్న పట్టుపురుగుల పెంపకం.. తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా లాభాలు

Mulberry Cultivation : తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా పంటలను తీసుకునే వెసులు బాటు ఉండటంతో రైతులు పట్టుపురుగుల పెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు.

Mulberry Cultivation

Mulberry Cultivation : ప్రతి నెలా ఆదాయం అందించే పట్టు పురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలతో ఏటా నష్టపోతున్న అన్నదాతలకు.. పట్టు పరిశ్రమ వరంగా మారింది. నిత్యం శ్రమ చేసే చిన్న, సన్నకారు రైతులకు ఈ పరిశ్రమ మరింత అనుకూలంగా వుంది.

పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా పంటలను తీసుకునే వెసులు బాటు ఉండటంతో రైతులు వీటిపెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే  రంగారెడ్డి జిల్లా కు చెందిన ఓ రైతు పట్టుపురుగుల పెంపకంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు

చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమగా విరాజిల్లుతోంది పట్టు పరిశ్రమ. పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి, పట్టు శాఖ ద్వారా అనేక ప్రోత్సహకాలు, రాయితీలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని  అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు  రంగారెడ్డి జిల్లా , మంచాల మండలం, జలాల్ మియా పల్లెకు చెందిన రైతు లింగయ్య.

పట్టుపురుగుల పెంపకం కాలం.. 25 రోజులు  
సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. దీనిలో గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చాక 18 రోజులు లార్వాదశలో వుంటుంది. ఆతర్వాత గూడుకట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు వుంటుంది. లార్వాదశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటిన మోల్టింగ్ దశ అంటారు. అయితే గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చే దశలో మొదటి 7రోజుల్లో ఉండే రెండు లార్వాలు అతి కీలకమైనవి. దీన్ని చాకీ దశ అంటారు.

ఈ దశలో పురుగుల మరణాల శాతం అధికంగా వుంటుంది. ఇప్పుడు చాకీ దశను పట్టుశాఖ నియంత్రణలో పూర్తిచేసి, రైతులకు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు రిస్కు తగ్గటంతోపాటు 7రోజుల పంటకాలం కూడా తగ్గుతోంది. అంటే 18 నుంచి 20 రోజుల్లో పంట చేతికి వస్తుంది . ప్రణాళిక బద్ధంగా పెంచితే  నెలకు 70 వేల నుండి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని తెలియజేస్తున్నారు రైతు లింగయ్య.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

మన తెలుగు రాష్ట్రాల్లో పట్టు పురుగుల పెంపకం అక్కడక్కడా మాత్రమే కనబడుతుంది, కాబట్టి నిరోద్యోగ యువతకు కానీ, కొత్త వ్యవసాయ వ్యాపారం చేద్దాం అనుకున్నవారికి పట్టు పురుగుల పెంపకం ఎంతో లాభదాయకం. ప్రభుత్వం కూడా పట్టుపురుగుల పెంపకానికి ఎన్నో ప్రోత్సహకాలను అందిస్తుంది. పట్టు పురుగుల కోసం షెడ్ వెయ్యడానికి, బెడ్లు ఏర్పాటు చెయ్యడానికి, మరియు లార్వాని కొనుగోలుచేసేందుకు ఇలా ప్రతీ అవసరానికి ప్రోత్సహకాలు అందిస్తుంది.

రాష్ట్ర సబ్సిడీ 25 శాతం

రైతు వాట 25 శాతం

షెడ్ నిర్మాణం

పొడవు 60 ఫీట్లు

అడ్డం 24 ఫీట్లు

పట్టు పురుగుల పెంపకం

మొదటి ఏడాది

తీసుకునే పంటలు  3 – 4