Mushroom Cultivation
Mushroom Cultivation : ప్రస్తుత తరుణంలో ఎక్కువ మంది యువతి, యువకులు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే మార్గాలను వారు అన్వేషిస్తున్నారు. అయితే అలాంటి వ్యాపారాల్లో పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. నగరాలు, పట్టణాలలో చాలా మంది సీజన్లతో సంబంధం లేకుండా పుట్టగొడుగులను తింటున్నారు. దీంతో పుట్టగొడుగులకు డిమాండ్ పెరిగింది. దీన్నే కుటీర పరిశ్రమగా చేసుకుంటే నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చని.. పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి.
READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్
చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్, చికెన్ టిక్కా, మటన్ టిక్కా, అపోలో ఫిష్.. ఇలాంటి ప్రత్యేక వంటకాల సరసన ఇప్పుడు పుట్టగొడుగులు కూడా చేరిపోయాయి. ఇప్పుడు ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా స్పెషల్ మెనూలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలు ఉంటున్నాయి. అంతే కాదు చిరు వ్యాపారులు తాజాగా పుట్టగొడుగులతో పచ్చళ్లు పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. అందువల్లే పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగుల లాభసాటి సాగుగా మారింది. దీన్నే స్వయం ఉపాధిగా మల్చుకుంటే మంచి ఆదాయం పొందవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి.
READ ALSO : Chandrababu Naidu Arrest: ఏపీ వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు.. గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం
చిన్నతరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో వున్న విశిష్ఠ పోషక విలువలు, ఆరోగ్యానికి మేలుచేసే గుణాల వల్ల వీటికి గిరాకీ నానాటికీ పెరుగుతోంది. అయితే వీటి పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వ్యాపారంగా చేపట్టే వారు విడుతల వారిగా చేపట్టినట్లైతే.. ఏడాది పొడవునా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
READ ALSO : Turkish Court : ముగ్గురు అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష.. తుర్కియే కోర్టు సంచలన తీర్పు
పుట్టగొడుగుల పెంపకంలో మనం వాడే విత్తనం, పంటకాలంలో వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించినైట్లెతే మంచి దిగుబడులను పొందవచ్చు. పుట్టగొడుగుల సాగుకు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు. మన దగ్గర ఉన్న వనరులతోనే పెంచుకోవచ్చు. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్ లో వినియోగిస్తే అదనపు ఆదాయం పొందవచ్చు.