Natural Farming Benefits
Natural Farming Benefits : రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆ ధారపడాల్సి వస్తోంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అందుకే పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం యూనిట్ లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపట్ల అవగాహన కల్పిస్తూ.. వారిచే ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నారు.
పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో ఆహారకొరతను తీర్చేందుకు… అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుంది. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. ఆహార ఉత్పత్తులు కషితమవుతున్నాయి. ప్రమాదకరంగా మారి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేందుకు, ఆరోగ్యకర పంటలను ఉత్పత్తిచేసేందుకు వ్యవసాయశాఖ ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే రైతు సాధికార సంస్థ కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, ఇందుపల్లి గ్రామం రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కలిపిస్తూ.. ఆసక్తి ఉన్న రైతుల చేత పెట్టుబడి లేని వ్యవసాయం చేయిస్తోంది.
మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీట కాలు చనిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతోంది. ఈ అంశాలన్నింటిపై రైతులను చైతన్యపరుస్తూ పకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు రైతు సాధికార సంస్థ ప్రతినిధులు. అంతే కాదు వరిగట్లపై ఇంటి సరిపడ కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు నాటిస్తూ.. అదనపు ఆదాయం పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు.
రైతుసాధికార సంస్థ సిబ్బంది ప్రకృతి వ్యవసాయంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు సోకే చీడపీడల నివారణకు రసాయన పురుగుమందులకు బదులు పొలొల్లానే ఖర్చు లేకుండా ఘన, ద్రవ జీవామృతాలు, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, జిల్లేడు ద్రావణం, , తదితరాలను తయారీ చేయిస్తున్నారు. పంటలకు హాని చేసే పురుగులు, కీటకాల నివారణకు పసుపు, తెలుపు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయిస్తున్నా రు. ప్రభుత్వ తోడ్పాటుతో పాటు పెట్టుబడి కూడా ఆదా అవుతుండడంతో రైతులు క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..