Paddy Cultivation : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెరగనున్న వరిసాగు విస్తీర్ణం

కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 40 వేల ఎకరాలుగా అంచనా వేశారు. ఇందులో వరిసాగు 2 లక్షల 70 వేల ఎకరాలు కాగా పత్తి 48 వేల ఎకరాల్లో సాగుకానుంది. మొక్కజొన్న 10 వేల ఎకరాల్లో సాగుచేయనున్నారు. అయితే జిల్లాల్లో నీటిసౌకర్యం పుష్కలంగా ఉండటంతో గత ఐదారేళ్లుగా వరిసాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది.

Paddy Cultivation

Paddy Cultivation : ఉమ్మడి కరీంగనగర్ జిల్లా వానాకాలం పంటల ప్రణాళిక  ఖరారు అయింది. వానాకాలంలో రైతుల ఇబ్బందులు తొలగిం చడానికి వ్యవసాయశాఖ ముందస్తుగా సాగు ప్రణాళిక రూపొందించింది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఎన్ని ఎకరాల్లో భూమి సాగవుతుందని అంచనా వేసి, ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు రూపొందించిన వానాకాలం పంటల ప్రణాళిక ఏంటో  ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Redgram Varieties : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగు సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా పంటల సాగు అవుతుందన్న అంచనాను అధికారులు వేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 3 లక్షల 36 వేల ఎకరాలు కాగా ఈ సీజన్‌లో 4 లక్షల 43 వేల ఎకరాల్లో సాగు కానుందని అంచనా వేశారు. ఇది సాధారణం కన్నా లక్ష ఎకరాలు అధికం. ఇందులో ప్రధానంగా వరి 2 లక్షల 98 వేల 500 ఎకరాలు, మొక్కజొన్న 40 వేల 375 ఎకరాలు, కందులు 50 వేల 125 , పెసర్లు 300 ఎకరాలు, ఇతర పప్పులు 675 ఎకరాలు, సోయా చిక్కు డు 1875, పత్తి 19 వేల 745 ఎకరాలు , చెరుకు 1200 ఎకరాలు, పసుపు 18 వేల 750, ఆయిల్‌ ఫాం 4800, ఇతర పంటలు 36,250 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికా రులు అంచనా వేశారు.

READ ALSO : Preparation of Paddy Nursery : ఖరీఫ్ వరినారుమడులు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం శాస్త్రవేత్తల సూచనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల 23 వేల 400 ఎకరాలు కాగా,  2 లక్షల 40 వేల 861 ఎకరాల్లో అన్ని రకాల ఆహార  ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని అంచనా. ఇందులో వరి 1 లక్షా 62 వేలు 36 ఎకరాలు కాగా మొక్కజొన్న 1347 ఎకరాలు, కంది 1756, పప్ప్పు దినుసులు ఎకరాల్లో 900, పత్తి 74 వేల 492 ఎకరాలు ఇతర  పంటలు 330 ఎకరాల్లో సాగుకానున్నాయి.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

పెద్దపల్లి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల 85 వేల 300 ఎకరాలు కాగా ఈ సంవత్సరం 3 లక్షల 20 వేల 832 ఎకరాలలో సాగు అయ్యే సూచనలున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 2 లక్షల 12 వేల 211 ఎకరాల్లో వరి సాగవుతుండగా,  62 వేల 755 ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నారు రైతులు. మొక్కజొన్న 1200 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేశారు.

READ ALSO : Organic Farmer : టీచింగ్ వదిలేసి.. ప్రకృతి వ్యవసాయం

కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 40 వేల ఎకరాలుగా అంచనా వేశారు. ఇందులో వరిసాగు 2 లక్షల 70 వేల ఎకరాలు కాగా పత్తి 48 వేల ఎకరాల్లో సాగుకానుంది. మొక్కజొన్న 10 వేల ఎకరాల్లో సాగుచేయనున్నారు. అయితే జిల్లాల్లో నీటిసౌకర్యం పుష్కలంగా ఉండటంతో గత ఐదారేళ్లుగా వరిసాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. దీంతో చాలావరకు భూములు చౌడుబారే సూచనలు ఉన్నాయి. రైతులు వ్యవసాయ అధికారులు అందించే పచ్చిరొట్ట ఎరువులను సాగుచేసి భూసారం పెంపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో కూరగాయల అమ్ముతున్న యువజంట

ఖరీఫ్ పంట సాగు అంచనాలను రూపొందించిన అధికారులు అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు రైతులకు భారంగా మారాయి. అయితే రైతులు మాత్రం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు