Paddy Cultivation : వరినాట్లలో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకు పాటించాల్సిన మెళకువలు

Paddy Cultivation : ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు పెరగడం.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరిచుకున్నాయి. దీంతో తెలంగాణ రైతాంగం అధికంగా వరిసాగుకు మొగ్గుచూపారు . ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని నారుమడలు పోసుకున్నారు.

Paddy Cultivation

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో రైతులు రబీ వరినాట్లకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల ప్రధాన పొలాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే రబీవరిపంటలో అధిక దిగుబడులు సాధించాలంటే తగిన మార్పులు చేసుకోవడం తప్పని సరి. లేత నారును సకాలంలో నాటే రైతంగా పొలంలో మొక్కల సాంద్రత తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి.. మరి ఆవివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Read Also : NMK Custard Apple Crop : 7 ఎకరాల్లో.. ఎన్.ఎం.కె గోల్డ్ సీతాఫలం, బర్హి ఖర్జూరం సాగు 

ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు పెరగడం.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరిచుకున్నాయి. దీంతో తెలంగాణ రైతాంగం అధికంగా వరిసాగుకు మొగ్గుచూపారు . ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని నారుమడలు పోసుకున్నారు. ఇప్పటికే వరినాట్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నాట్లు వేసే ముందు ప్రధాన పొలాన్ని రెండు వారాల ముందునుండే సిద్ధం చేసుకోవాలి.

రబీ వరినాట్లు వేస్తున్న రైతులు : 
నాలుగు నుండి ఐదాకుల దశలో నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. కొద్దిగా చౌడున్న పొలాల్లో లేతనారు వేయవ్దు. మట్ట ముదిరాకా నాటుకోవాలి. అయితే భూసారాన్ని, కాలాన్ని బట్టి కుదుళ్ల సంష్య మారుతుంది. రబీ వరిలో అధిక దిగుబడులను పొందాలంటే వరినాటే సమయంలోనే ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించాలో తెలియజేస్తున్నారు , మంచిర్యాల జిల్లా, బెల్లంపట్టి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త తిరుపతి.

ఎరువుల యాజమాన్యం :
బరువైన నేలల్లో భాస్వరం , పోటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి

తేలికపాటి నేలల్లో ఆఖరిదుక్కిలో భాస్వరం సగభాగం పొటాష్ వేయాలి

జింక్ ధాతులోపం నివారణ :

ఎకరాకు జింక్ సల్ఫేట్ 20 కి.

ఆఖరి దుక్కిలో వేయాలి
జింక్ సల్ఫేట్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి

పైపాటుగా పిచికారి  చేయాలి

మొక్కల సాంద్రత మధ్యకాలిక రకాలు

చదరపు మీటరుకు 44 మొక్కలు

మొక్కల సాంద్రత :

స్వల్పకాలిక రకాలు చదరపు మీటరుకు 66 మొక్కలు

కలుపు నివారణ :

నాటిన వెంటనే పెట్లాక్లోర్ లేదా బ్యుటాక్లోర్ పిచికారి చేయాలి

కాండం తెలిచే పురుగు నివారణ :

నారు కొనలను తుంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి.

నాటు వేసే 7 రోజుల ముందు కార్భోప్యూరాన్ 3 జి గుళికలు 800 గ్రా. నారుమడిలో వేయాలి

Read Also : Papaya Cultivation Techniques : బొప్పాయిలో సూక్ష్మధాతు లోపం నివారణ.. సూచనలిస్తున్న శాస్త్రవేత్తలు

ట్రెండింగ్ వార్తలు