NMK Custard Apple Crop : 7 ఎకరాల్లో.. ఎన్.ఎం.కె గోల్డ్ సీతాఫలం, బర్హి ఖర్జూరం సాగు

NMK Custard Apple Crop : పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదగుతారు.

NMK Custard Apple Crop : 7 ఎకరాల్లో.. ఎన్.ఎం.కె గోల్డ్ సీతాఫలం, బర్హి ఖర్జూరం సాగు

NMK Custard Apple Crop

NMK Custard Apple Crop : ఎలాంటి వ్యవసాయమైన లాభసాటిగా సాగితేనే రైతు బాగుంటాడు. ఇటు ప్రజలు బాగుంటారు. అయితే మార్కెట్ కు అనుగుణంగా పంటల ఎంపిక.. చేసుకొని, శాస్త్రీయ పద్ధతులు పాటించి సాగుచేస్తేనే లాభాలు ఆర్జిస్తారు. ఇటీవల చాలామంది రైతులు సంప్రదాయ పంటల స్థానంలో కొత్త కొత్త పంటలను సాగుచేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు హైబ్రీడ్ సీతాఫలంతో పాటు ఖర్జూరం సాగుచేస్తూ.. లాభాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు.

పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదగుతారు. ఈ సూత్రాన్నే కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈకోవలోనే కృష్ణా జిల్లా, బాపుల పాడు మండలం, మడిచెర్ల గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో 3 ఎకరాల్లో ఎన్.కె.ఎం గోల్డ్ రకం సీతాఫలం.. 4 ఎకరాల్లో ఖర్జూరను సాగుచేస్తున్నారు.

Read Also : Chilli Crop Cultivation : మిరప తోటల్లో వైరస్ తెగులు ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం

శీతాకాలంలో తీపిని పంచే మృదు మధురమైన పండు సీతాఫలం. ఒకప్పుడు కొండలు, గుట్టలు, కాలువ గట్లపై విరివిగా కనిపించే ఈ పండుకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో వాణిజ్య సరళిలో రైతులు దీని సాగుకు ముందడుగు వేస్తున్నారు. రైతు శ్రీకాంత్ కూడా 3 ఎకరాల్లో 2019 లో సోలాపూర్ నుండి ఎన్.కె.ఎం గోల్డ్ రకం సీతాఫలం మొక్కలను దిగుమతి చేసుకొని నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. సాధారణంగా శీతాఫలం సీజన్ నవంబరుతో ముగిస్తే.. ఈ రకం నుండి జనవరి వరకు దిగుబడి వస్తుంది.

అంతే కాదు కాయ కూడా పెద్దసైజులో ఉండి.. గింజలు తక్కువగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది. రైతు శ్రీకాంత్ మరో 4 ఎకరాల్లో బర్హి రకం ఖర్జూరాను సాగుచేశారు. ఇది నేరుగా పండును తినే రకం.  నాటిన 18 నెలలకు పూత వచ్చింది. 3 ఏళ్లకు మొదటి పంట దిగుబడి వచ్చింది. 4 ఎకరాల్లో టన్నున్నర దిగుబడిని తీశారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి రాలేదు. సంప్రదాయ పంటలతో పోల్చితే ఈ పండ్లసాగు ఎంతో మేలని చెబుతున్నారు రైతు.

సంప్రదాయ పంటల స్థానంలో పండ్లతోటల సాగు :
ఎలాంటి వ్యవసాయమైన లాభసాటిగా సాగితేనే రైతు బాగుంటాడు. ఇటు ప్రజలు బాగుంటారు. అయితే మార్కెట్ కు అనుగుణంగా పంటల ఎంపిక.. చేసుకొని, శాస్త్రీయ పద్ధతులు పాటించి సాగుచేస్తేనే లాభాలు ఆర్జిస్తారు. ఇటీవల చాలామంది రైతులు సంప్రదాయ పంటల స్థానంలో కొత్త కొత్త పంటలను సాగుచేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు హైబ్రీడ్ సీతాఫలంతో పాటు ఖర్జూరం సాగుచేస్తూ.. లాభాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు. పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి.

అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదగుతారు. ఈ సూత్రాన్నే కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈకోవలోనే కృష్ణా జిల్లా, బాపుల పాడు మండలం, మడిచెర్ల గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో 3 ఎకరాల్లో ఎన్.కె.ఎం గోల్డ్ రకం సీతాఫలం.. 4 ఎకరాల్లో ఖర్జూరను సాగుచేస్తున్నారు.

శీతాకాలంలో తీపిని పంచే మృదు మధురమైన పండు సీతాఫలం. ఒకప్పుడు కొండలు, గుట్టలు, కాలువ గట్లపై విరివిగా కనిపించే ఈ పండుకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో వాణిజ్య సరళిలో రైతులు దీని సాగుకు ముందడుగు వేస్తున్నారు. రైతు శ్రీకాంత్ కూడా 3 ఎకరాల్లో 2019 లో సోలాపూర్ నుండి ఎన్.కె.ఎం గోల్డ్ రకం సీతాఫలం మొక్కలను దిగుమతి చేసుకొని నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. సాధారణంగా శీతాఫలం సీజన్ నవంబరుతో ముగిస్తే.. ఈ రకం నుండి జనవరి వరకు దిగుబడి వస్తుంది.

అంతే కాదు కాయ కూడా పెద్దసైజులో ఉండి.. గింజలు తక్కువగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది. రైతు శ్రీకాంత్ మరో 4 ఎకరాల్లో బర్హి రకం ఖర్జూరాను సాగుచేశారు. ఇది నేరుగా పండును తినే రకం.  నాటిన 18 నెలలకు పూత వచ్చింది. 3 ఏళ్లకు మొదటి పంట దిగుబడి వచ్చింది. 4 ఎకరాల్లో టన్నున్నర దిగుబడిని తీశారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి రాలేదు. సంప్రదాయ పంటలతో పోల్చితే ఈ పండ్లసాగు ఎంతో మేలని చెబుతున్నారు రైతు.

Read Also : Papaya Cultivation Techniques : బొప్పాయిలో సూక్ష్మధాతు లోపం నివారణ.. సూచనలిస్తున్న శాస్త్రవేత్తలు