Paddy Cultivation : రబీ వరిలో చీడపీడల నివారణ పద్ధతులు

Paddy Cultivation :తెలుగు రాష్ట్రాల్లో ని రైతాంగం రబీ వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలకరిలోపు నాట్లు పూర్తి చేయాలి.

Paddy Cultivation

Paddy Cultivation : నీటి వనరులను బట్టి రబీ వరిని సాగు చేస్తున్న రైతులు , సరియైన యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా మంచి దిగుబడులను సాధించవచ్చు. విత్తనాల ఎంపిక దగ్గరి నుంచి నారుమడి బాగా ఎదిగిన తర్వాత, నాట్లు వేసేటప్పుడు సరైన యాజమాన్య పద్దతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా. సయ్యద్ అహ్మద్ హుస్సేన్.

Read Also : Mango Farming Cultivation : మామిడి తోటల్లో పూత పురుగును అరికట్టే విధానం

తెలుగు రాష్ట్రాల్లో ని రైతాంగం రబీ వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలకరిలోపు నాట్లు పూర్తి చేయాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో జనవరి మొదటి పక్షంలో నాట్లను పూర్తిచేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నారుమళ్లలో నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి.

ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 30 పెం. మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంత వరకు అదుపు చేయవచ్చు. అంతే కాకుండా ఎరువులు, పురుగు మందులు వేయటానికి ఈ బాటలు ఉపయోగపడుతాయి.

Read Also : Care and Feeding : శీతాకాలంలో గేదెల పోషణలో జాగ్రత్తలు

ట్రెండింగ్ వార్తలు