rice weed control strategies in agriculture
Paddy Weed Control : ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నీటి వసతి ఉన్నచోట ఇప్పటికే వరినాట్లు పడ్డాయి. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. మరికొన్ని చోట్ల నారుమడులు ఉన్నాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వివిధ దశల్లో రబీ వరి పనులు సాగుతున్నాయి. అయితే వరిలో మొదటి దశలోనే సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చని చెబుతున్నారు సీనియర్ శాస్త్రవేత్త, డా. నాగభూషనం.
Read Also : Paddy Cultivation : వరినాట్లలో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకు పాటించాల్సిన మెళకువలు
ఇప్పటికే చాలా చోట్ల వరినాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఫిబ్రవరి వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే పంటలో అధికోత్పత్తికి సమగ్ర పోషక యాజమాన్యం ఎంత ముఖ్యమో, కలుపు నివారణా అంతే ముఖ్యం. పంట వేసే పోషకాలను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల సుమారు 40 శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది.
అందువల్ల ప్రతి పంటలోనూ కలుపు నివారణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం నాట్లు వేసిన, వేయబోయే పొలంలో సమగ్ర కలుపు యాజమాన్యం చేపడితే ఖర్చులు తగ్గి, నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డా. నాగభూషనం. మరి ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం… సకాలంలో , సమయానుకూలంగా ప్రణాళిక బద్దంగా కలుపు మందులను, సిఫార్సు చేసిన మోతాదులో పిచికారి చేస్తే, రబీలో కూడా అధిక దిగుబడి తీసేందు ఆస్కారం ఉంటుంది.
Read Also : Paddy Cultivation : రబీ వరి నారుమడులలో చేపట్టాల్సిన యాజమాన్యం