seed germination
Seed Germination : విత్తుబాగుంటేనే పంట దిగుబడి బాగా వస్తుందన్నది నానుడి. నాణ్యమైన విత్తనంతో అశించిన స్థాయిలో పంట దిగుబడి కూడా వస్తుంది. తెగుళ్లు, చీడపీడల సమస్య కూడా ఉండదు.
విత్తనంలో నాణ్యత లేకపోతే చీడపీడల బెడదతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీని వల్ల రైతులు నష్ట పోవాల్సిన పరిస్థితి. అంతటి ప్రాధాన్యం గల విత్తనాలు నాణ్యమైనవో, కాదో తెలుసుకునేందుకు ప్రతి రైతు విత్తన నాణ్యత టెస్టింగ్ లు చేయించుకోవాలని సూచిస్తున్నారు విత్తన టెస్టింగ్ ల్యాబ్ అధికారులు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..
రైతులు ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లలో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీల దగ్గర కొంత మంది , ఇటు ప్రైవేట్ డీలర్ల వద్ద కొంతమంది విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. రైతులు పొలంలో విత్తనాలను వేసే ముందే విత్తనం నాణ్య మైనదో కాదో తెలియాలి.
ఎందుకంటే విత్తనాన్ని పొలంలో చల్లిన తర్వాత అది నాణ్యమైనది కాకపోతే నష్టపోవాల్సి వస్తుంది. నాణ్యత లేని విత్తనాలు సాగు చేయడం వల్ల పంట ఎదుగుదల ఉండదు. రైతు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. అందుకోసం ప్రతి రైతు విత్తన శాంపిల్స్ ను మొలక శాతం పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో విత్తన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read Also : Sesame Cultivation : వేసవి రబీకి అనువైన నువ్వు రకాలు – అధిక దిగుబడులకు సూచనలు