pest Control in Chilli cultivation techniques
Chilli Cultivation : తెలుగు రాష్ట్రాల్లో మిరప పంట పూత నుండి కాయదశలో ఉంది. ప్రస్థుతం కొన్ని ప్రాంతాలలో మిరప నుంచి తొలికాపును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో చాలా ప్రాంతాల్లో పురుగుల తాకిడి ఎక్కువవటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి, సకాలంలో పురుగులు నివారించాలంటూ.. సమగ్ర సస్యరక్షణ చర్యలు గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్.
వాయిస్ ఓవర్ : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ప్రస్తుతం వేసిన పంటలో ఇప్పుడు పురుగుల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని సకాలంలో గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మిరపకు ఆశించిన పురుగులను ఏవిధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్.
Read Also : Maize Cultivation : మొక్కజొన్న పంటకు ఆటంకంగా ఎండుతెగులు – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు