Maize Cultivation : మొక్కజొన్న పంటకు ఆటంకంగా ఎండుతెగులు – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

Maize Cultivation : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. 

Maize Cultivation : మొక్కజొన్న పంటకు ఆటంకంగా ఎండుతెగులు – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

Prevention of dry rot in Maize Cultivation

Updated On : December 18, 2024 / 2:25 PM IST

Maize Cultivation : రబీ మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మారింది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు.

అయితే, ఎండుతెగులు ఈ పంటకు తీవ్రఆటంకం కలిగిస్తోంది. విత్తనం మొదలు.. పంట చివరి వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడిని పొందవచ్చని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్ లోని మొక్కొజన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. మల్లయ్య.

వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.  స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తున్నారు.

అయితే పంట మార్పిడి లేకపోవడం.. నీటి తడులను సకాలంలో అందిచకపోవడం.. సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టకపోవడంతో మొక్కజొన్నపంటలకు ఎండుతెగులు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తోంది. విత్తన ఎంపిక నుండే సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని మొక్కొజన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. మల్లయ్య.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు