Pest Control In Paddy Cultivation
Paddy Cultivation : ప్రస్తుతం తెగులు రాష్ట్రాల్లో వరి పైతు వివిధ దశలో ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు
తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకిపాలుపోసుకునే దశ వరకు ఉంది. కాలువకింది సాగుచేసే ప్రాంతాల్లో బాక్టీరియా ఎండాకు తెగులు ఆశించింది. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండ తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.
Read Also : Marigold Cultivation : పండుగల వేళ బంతిపూలకు డిమాండ్.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం