Soyabean
Soybean Cultivation : వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉందా పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సోయా పంటలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటి నివారణ చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ ALSO : ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు
ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి , సోయా పంటలను సాగుచేస్తుంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది. అయితే అడపాదడప కురుస్తున్న వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో సోయా పంటకు చీడపీడల ఉధృతి పెరిగింది.
READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు
వీటిని సకాలంలో అరికడితేనే దిగుబడి చేతికొస్తుంది. లేదంటే రైతులు అప్పుల పాలు కావాల్సిందే. అసలు ఏఏ చీడపీడలు ఆశించాయి.. వాటిని ఏవిధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్