Groundnut Crop : వేరుశనగ పంటలో.. పొగాకు లద్దెపురుగుల నివారణ చర్యలు

Groundnut Crop : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశనగ . గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.

Pest Control Techniques

Groundnut Crop : నూనెగింజల పంటల్లో ముఖ్యమైంది వేరుశనగ. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేసారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విత్తిన వేరుశన 30 నుండి 45 రోజుల దశలో ఉంది. ఇప్పుడే పూత వచ్చే సమయం.

Read Also : Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ

అయితే కొన్ని ప్రాంతాల్లో పొగాకు లద్దెపురుగు ఆశించి నష్టం కలిగిస్తోందని రైతులు తెలియజేస్తున్నారు. మొక్కలోని లేత భాగాలను తినేయటం వల్ల పంట పెరుగుదల లోపించింది. ఈ పురుగును గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకటరెడ్డి.

వేరుశనగ పంటకు పొగాకు లద్దెపురుగుల బెడద :
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశనగ . గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు. ఇప్పటికే విత్తిన వేరుశనగ పూత దశలో ఉంది.

ఈ సమయంలో పొగాకు లద్దెపురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ పురుగు పగటి వేళల్లో కనిపించకుండా చెట్ల మొదళ్లలో, భూమి నెర్రలల్లో దాగి ఉండి, ఉదయం, రాత్రి వేళ్లలో చెట్లపైకి వచ్చి ఆకులను తినివేస్తుంది. దీంతో కిరణజన్య సంయోగక్రియ తగ్గి , ఊడలు తగ్గిపోతాయి. దిగుబడికి నష్టం వాటిల్లుతుంది.

కాబట్టి పొగాకు లద్దెపురుగు ఆశించిందని గుర్తిస్తే , తొలి దశనుండే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయం కళాశాల ప్రొఫెసర్ వెంకటరెడ్డి. వేరుశనగ పంటలో పూత దశ చాలా ముఖ్యం . ఈ దశనుండి కాయ ఊరే దశ వరకు చీడపీడల పట్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు తీసే అవకాశం ఉంటుంది.

Read Also : Farming Sesame Seeds : అధిక దిగుబడుల కోసం నువ్వులో యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు