Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ

Mirchi Cultivation : ప్రస్తుతం పూత పురుగు లేదా గుండు పూత ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేసిన మిరప రెండో కోత దశలో ఉండగా, ముందుగా వేసిన ప్రాంతాల్లో మూడవ కోత దశలో ఉంది.

Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ

Mirchi Cultivation

Updated On : February 18, 2024 / 2:58 PM IST

Mirchi Cultivation : తెలుగు రాష్ట్రాల్లో మిరప కోత దశలో ఉంది. అయితే ఈ సమయంలో పూత పురుగు సోకి మిరపతోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పిందె దశలో కాయలు గిడసబారి, గింజలు లేకుండా వంకరలు తిరిగి పూత, కాత విపరీతంగా రాల్చుతుంది.  ఉన్నకాయ నాణ్యత కోల్పోవడమే కాకుండా , దిగుబడిని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ పురుగు నివారణకు, ప్రస్థుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు  ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.

Read Also : Corn Cultivation Tips : మొక్కజొన్న నిల్వల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ ఏడాది మిర్చి ధరలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే మంచి లాభాలు వస్తాయనుకున్న రైతులకు చీడపీడల బెడద తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేసిన మిరప రెండో కోత దశలో ఉండగా, ముందుగా వేసిన ప్రాంతాల్లో మూడవ కోత దశలో ఉంది.

మిరపలో పూత పురుగుల ఉధృతి : 
అయితే ప్రస్తుతం పూత పురుగు లేదా గుండు పూత ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. వచ్చిన పూత, పడ్డ పిందెలు రాలిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి కాయలు వంకరులు తిరిగి ఉండటంతో మార్కెట్ లో ధరలు పలకడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పూత పురుగును నివారిస్తేనే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. నాణ్యత కోల్పోయిన మిరపను మార్కెట్ కు తీసుకెళ్తే  సరైన ధర రాదు. కాబట్టి రైతులు గిడసబారిన కాయలను తీసివేసి మేలైన కాయలను మాత్రమే మార్కెట్ కు తీసుకెళ్లాలి.

Read Also : Chrysanthemum Cultivation : సిరులు కురిపిస్తున్న చామంతి పూల సాగు