Chrysanthemum Cultivation : సిరులు కురిపిస్తున్న చామంతి పూల సాగు

Chrysanthemum Cultivation : ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో దిగుబడి వచ్చేలా ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు దిగుబడి వచ్చే వీలున్నందను, పూల ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తంచేసారు.

Chrysanthemum Cultivation : సిరులు కురిపిస్తున్న చామంతి పూల సాగు

Huge Profits to Chrysanthemum Cultivation

Chrysanthemum Cultivation : పూల సాగులో గులాబీ తర్వాతి స్థానం చామంతిదే. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట కూడా ఇదే. పండుగలు, పర్వదినాలతోపాటు డెకరేషన్ లలో ఎక్కువగా వాడే చామంతికి.. ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటుంది. అందుకే, రాష్ట్రంలో భారీగా సాగవుతున్నది. ముఖ్యంగా శీతాకాలంలో విరబూసే సువాసనల చామంతి.. అన్నదాత ఇంట సిరుల వర్షం కురిపిస్తున్నది. అందుకే ప్రతి ఏటా జనవరి , ఫిబ్రవరి నెలలో దిగుబడి వచ్చే విధంగా సాగుచేసి లాభాలు పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు.

Read Also : Sesame Cultivation : నువ్వుల సాగుపై జగిత్యాల పరిశోధనా స్థానాల అధ్వర్యంలో కిసాన్ మేళా

పండగలు, పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు, ఇలా సంవత్సరం పొడువునా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటి అవసరాలకి తగినట్టు పూలను సాగుచేస్తే.. ఇక ఆరైతుకు లాభాల పంట పండుతుంది. దీన్నే తూచాతప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా, నార్పల మండలం, మద్దలపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మినారాయణ.

ఏడాది నుండి చామంతి పూల సాగు :
ఇదిగో ఇక్కడ రంగు రంగుల్లో కనిపిస్తున్న ఈ చామంతి పూలను చూడండీ… మొత్తం 2 ఎకరాల విస్తీర్ణం. ఇందులో 4 రకాల పూలను సాగుచేస్తున్నారు రైతు లక్ష్మినారాయణ. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో దిగుబడి వచ్చేలా ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో మొక్కలను నాటారు. అయితే చామంతి పంటకు పలురకాల తెగుళ్లు, పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది. వీటివల్ల మొక్కలు చనిపోవడం, దిగుబడి తగ్గడంలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

ముఖ్యంగా పూలు పూసే సమయంలో పూలను తొలిచే పురుగులు కనిపిస్తాయి. వీటిని ఎప్పటికటప్పుడు గమనిస్తూ.. నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పంట విరగపూసింది. వచ్చిన దిగుబడిని బెంగళూరు, హిందూపురం, అనంతపురం మార్కెట్ లకు తరలిస్తున్నారు. మార్కెట్ లో ధర కూడా బాగా పలుకుతుండటంతో మంచి లాభాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చామంతి విరగ పూయటం, పొలంలో మొక్కల సాంధ్రత అధికంగా వుండటంతో రైతు లక్ష్మి నారాయణ కనీసంగా ఎకరాకు 3 టన్నుల దిగుబడి సాధించే వీలుంది. సాగు ఖర్చుకు రెండెకరాలపై 80 నుండి లక్ష రూపాయల వరకు ఖర్చవుతోంది. అయితే కిలోకు ప్రస్తుతం 80 నుండి 90 రూపాయలు పలుకుతోంది. సరాసరి 60 రూపాయల ధర సాధించినా ఎకరాకు 3 లక్షల 60 వేల ఆదాయం పొందే వీలుంది. అయితే ఫిబ్రవరి నెలాఖరు వరకు దిగుబడి వచ్చే వీలున్నందను, పూల ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తంచేసారు.

Read Also : Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగుకు మొగ్గుచూపుతున్న రైతులు