Corn Cultivation Tips : మొక్కజొన్న నిల్వల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Corn Cultivation Tips :  తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తుంటారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల వరిమాగాణుల్లో ఇప్పుడే విత్తుతున్నారు.

Corn Cultivation Tips : మొక్కజొన్న నిల్వల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Corn Cultivation Tips

Corn Cultivation Tips :  ప్రస్తుతం మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంది.  అయితే ఈ దశలో సరైన జాగ్రత్తలు పాటించాలి. పంట కోసిన తరువాత నిలువచేసేటప్పుడు పురుగులు , శిలీంద్రాలు, ఎలుకలు ఆశించి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నుండి ధాన్యన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చెబుతున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. సౌజన్య

Read Also : Jamun Cultivation Tips : పూత నిలిచేందుకు అల్లనేరేడులో యాజమాన్యం

తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తుంటారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల వరిమాగాణుల్లో ఇప్పుడే విత్తుతున్నారు. కోత దశలో ఉన్న మొక్కజొన్న విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నూర్పిడి తరువాత 2-3 రోజులు 12 శాతం తేమ వచ్చే వరకు ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసుకోవాలి.

ధాన్యం నిల్వలో జాగ్రత్తలు  :
మొక్కజొన్న నిలువలు చేసేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నికర ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మొక్కజొన్నను కొసిన వెంటనే ఎండలో ఆరబెట్టాలి. తరువాత గోనె సంచులలో లేదా పాలిథీన్ సంచులలో భద్రపరిచి చల్లని, తక్కువ తేమ గల ప్రాంతాల్లో నిలువ చేయాలి. దీనితో పాటు నిల్వలో తేమగాని, ఎలుకలు, పురుగులు, శిలాంధ్రాలు ఆశించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి . పీటలు నిర్మించుకోని పీటలపై ధాన్యం బస్తాలను పేర్చుకోవాలి. రెండు వరసలు ఉన్న బస్తాలను ఉపయోగించితే మంచిది.  గృహ అవసరాలకు మొక్కజొన్నను ఉపయోగించే టప్పుడు , యూకలిప్టకస్ ఆకులు లేదా, వేప ఆకుల, వసకొమ్ములు లేదా అడ్డసార ఆకులు లేదా నిర్గుండే ఆకులు కలిపి నిలువ ఉంచుకోవాలి.

Read Also : Chrysanthemum Cultivation : సిరులు కురిపిస్తున్న చామంతి పూల సాగు