Jamun Cultivation Tips : పూత నిలిచేందుకు అల్లనేరేడులో యాజమాన్యం

Jamun Cultivation Tips : మన దేశంలో అన్నీ వాతావరణ స్థితిగతుల్లో నేరేడు సాగుకు అనుకూలత ఉంది. దేశీయ, ఎగుమతుల వ్యాపార రూపంలో ఈ పండ్లు రైతులకు మంచి లాభసాటితో కూడిన పంట.

Jamun Cultivation Tips : పూత నిలిచేందుకు అల్లనేరేడులో యాజమాన్యం

Jamun Cultivation Tips

Jamun Cultivation Tips : ఆయుర్వేద ఔషధాల గని నేరేడు. తీపి, వగరు, పులుపు రుచుల మిశ్రమాలతో కూడిన ఈ పండ్లను ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్ లో ఎంత ధర ఉన్న కొనుక్కోని తినక మానరు. అంత డిమాండ్ ఉన్న అల్లనేరేడు పంటను సాగుచేసే రైతులు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. మార్చినెల పూత వచ్చే  సమయం కావడంతో, కొన్ని మెళకువలను పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చని తెలియజేస్తున్నారు. సంగారెడ్డి జల్లా , ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. హరికాంత్ పోరికా.

Read Also : Wheat Cultivation : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి, తెగుళ్ల నివారణ

చాలా వేగంగా పెరిగే పండ్ల వృక్షం ఏదైనా ఉందా అంటే, అది నేరేడు వృక్షమే. దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. వంద ఏళ్ళకు పైగా ఫల సంపదను అందించగల వృక్షం ఇది. గట్టిగా ఉండే ఈ చెట్టు కాండం కలప అవసరాలను కూడా తీరుస్తుంది. మన దేశంలో అన్నీ వాతావరణ స్థితిగతుల్లో నేరేడు సాగుకు అనుకూలత ఉంది. దేశీయ, ఎగుమతుల వ్యాపార రూపంలో ఈ పండ్లు రైతులకు మంచి లాభసాటితో కూడిన పంట.

ప్రస్థుతం కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో ఎకరానికి 100 మొక్కల చొప్పున నాటుతున్నారు. చెట్టు ఎత్తు 15 అడుగులకు మించి పెరగకుండా ఏటా కొమ్మల కత్తిరింపు ద్వారా నియంత్రిస్తున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి ఫలసాయం ప్రారంభమవుతుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో పూతకి వచ్చి, జూన్-జులై నెలల్లో పండ్లు కోతకు వస్తాయి. చెట్టుకి 75 నుంచి 100 కిలోల దిగుబడి పొందే వీలుంటుంది.

ఈ పంట కాపు రెండు నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి, ఆకాపును నిలబెట్టుకోవాలంటే పూత రాలకుండా చూసుకోవాలి. మార్చి పూత వచ్చే సమయం కాబట్టి పూతను కాపాడుకునేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు, సంగారెడ్డి జల్లా , ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. హరికాంత్ పోరికా. ఒక్కో నేరేడు చెట్టునుండి 80 నుంచి 100 కిలోల దిగుబడి పొందవచ్చు. ఇటు పండ్లకు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే అధిక దిగుబడులను పొంది ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది .

Read Also : Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగుకు మొగ్గుచూపుతున్న రైతులు