Paddy Cultivation : వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం  దుబ్బుచేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది.  మరి కొన్ని చోట్లలో ఇప్పడిప్పుడే నాట్లు వేస్తున్నారు.

Paddy Cultivation

Paddy Cultivation : తెలంగాణలో సాగుచేస్తున్న వరిపంట వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల చిరుపొట్ట దశలో ఉండగా.. ఇంకా అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు రైతులు.

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు.. ముందుగా సాగుచేసిన వరిపొలాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి తొలిదశలోనే ఈ తెగులు నివారణకు సస్యరక్షణ చర్యులు చేపట్టాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ లోని వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త కిరణ్ బాబు.

Read Also : Cotton Crop : పత్తిలో రసంపీల్చే పురుగుల నివారణ

తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం  దుబ్బుచేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది.  మరి కొన్ని చోట్లలో ఇప్పడిప్పుడే నాట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా.. ముందుగా సన్నగింజ వరి రకాలు నాట్లు వేసిన ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించుటకు అనుకూలం.

ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఈ తెగులుకు అనుకూలం. ఇప్పటికే అనేకచోట్ల శాస్త్రవేత్తలు వీటి ఉధృతిని గుర్తించారు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీషులో బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు. ఈ తెగులును తాత్కాలికంగా అదుపుచేయగలం తప్ప, పూర్తిస్థాయిలో నివారణ లేదు.

చిరు జల్లులు, మంచు వాతావరణంలో ఈ తెగులు త్వరగా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త కిరణ్ బాబు.

Read Also : Papaya Cultivation : లాభాలు కురిపిస్తున్న బొప్పాయి

ట్రెండింగ్ వార్తలు