Papaya Cultivation : లాభాలు కురిపిస్తున్న బొప్పాయి

Papaya Cultivation : వాణిజ్య పంటల సాగుతో అన్నదాత కు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలు వచ్చే పంటలపై దృష్టిపెడుతున్నారు.

Papaya Cultivation : లాభాలు కురిపిస్తున్న బొప్పాయి

Profits in Papaya Cultivation

Updated On : September 8, 2024 / 2:29 PM IST

Papaya Cultivation : బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా.. తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది తెగుళ్ల బెడద లేకపోవడం.. మంచి ధరలులు పలుకుతుండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓరైతుకు ఈ పంట సిరులు కురిపిస్తోంది.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

వాణిజ్య పంటల సాగుతో అన్నదాత కు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలు వచ్చే పంటలపై దృష్టిపెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలు ఉంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, పొంగూరు గ్రామానికి చెందిన రైతు నాగరాజు రెడ్డి 8 ఏళ్లుగా బొప్పాయి పంట సాగు చేస్తూ.. లాభాలను గడిస్తున్నారు.

రైతు నాగరాజు బొప్పాయి తోటలో కలుపు రాకుండా మల్చింగ్‌ షీట్ల ఏర్పాటుచేసి , డ్రిప్‌ ఇరిగేషన్‌, తదితర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి.. మొత్తం 15 ఎకరాల్లో బొప్పాయి సాగుచేశారు. ఈ పంట నాటిన 5 నెలల్లోనే పూతకు వచ్చి ఆరో నెలలో కాయలు కాయడం మొదలవుతుంది.

ఏడవ నెలనుండి కోత దిగుబడులు ప్రారంభమవుతుంటాయి. మొదటి కోత తరువాత 20 రోజులకు ఒకసారి కోత కోస్తుంటారు. ఇలా పంట పూర్తి అయ్యేసరికి 8 కోతలు వస్తాయి. ఈ ఏడాది తెగుళ్లు తగ్గడం.. పంట దిగుబడులు కూడా పెరిగాయి. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడిని పొందారు రైతు.

ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర రూ. 10 వేలు పలికింది.  రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం పొందారన్నమాట.

15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు. పెట్టుబడి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున 15 లక్షలు పోగా ఈ ఏడాది రైతు నికర ఆదాయం 20 లక్షలు. కాబట్టి రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తే.. లాభాలను ఇలాగే పొందే అవకాశం ఉంటుంది.

Read Also : Cotton Crop : పత్తిలో రసంపీల్చే పురుగుల నివారణ