Tomato Crop : టమాట తోటల్లో శనిగ పచ్చపురుగుల అరికట్టే పద్ధతి

Tomato Crop : శీతాకాలంలో వేసిన పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు అన్ని కాలాల్లో ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.

Pest Control Techniques In Tomato Crop

Tomato Crop : చలిగాలులు వీస్తుండటంతో టమాటకు శనిగపచ్చ పురుగు ఆశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కంది వేసిన పరిసర ప్రాంతాలలో  టమాట సాగుచేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన శాస్త్రవేత్త డా.  రాంప్రసాద్ తెలిపారు. శనిగపచ్చ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం..

Read Also : Mango Cultivation : మామిడిలో పూత, కాయ నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలు

కూరగాయల్లో ప్రధాన పంట టొమాటో. అన్ని కాలాల్లోనూ పండుతుంది. అయితే శీతాకాలంలో వేసిన పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు అన్ని కాలాల్లో ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సున్నితమైన ఈ పంటను , వివిధర రకాల తెగుళ్లు, పురుగులు ప్రభావితం చేస్తుంటాయి.

టమాట తోటల్లో శనగపచ్చ పురుగు ఉధృతి :
సాధారణంగా రైతులు,  పురుగు  ఆశించిన తర్వాత, అధిక మోతాదులో రసాయన మందులను, తక్కువ వ్యవధిలోనే పిచికారీ చేస్తారు. దీని వల్ల రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా తెగులు ఉధృతి తగ్గక అది దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం టమాటకు శనిగపచ్చపురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు గుర్తించినట్లైతే వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త  డా. రాంప్రసాద్.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ