Pest Management in Groundnut : వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Pest Management in Groundnut : గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.

Integrated Pest Management in Groundnut

Pest Management in Groundnut : నూనెగింజల పంటల్లో ముఖ్యమైంది వేరుశనగ. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేసారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ పురుగులను గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.

Read Also : Mirchi Crop Cultivation : మిరపను కోసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

వేరుశనగలో పెరిగిన పురుగల ఉధృతి : 
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశనగ . గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వేరుశనగను విత్తారు. అయితే వివిధ దశలో ఉన్న ఈ పంటకు ఇప్పుడు పురుగుల బెడద ఎక్కువైంది. రసంపీట్చే పురుగులు, వేరు పురుగు, పొగాకు లద్దెపురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.

ముఖ్యంగా  పొగాకు లద్దెపురుగు పగటి వేళల్లో  కనిపించకుండా చెట్ల మొదళ్లలో, భూమి నెర్రలల్లో దాగి ఉండి, ఉదయం, రాత్రి వేళ్లలో చెట్లపైకి వచ్చి ఆకులను తినివేస్తుంది. దీంతో కిరణజన్య సంయోగక్రియ తగ్గి , ఊడలు తగ్గిపోతాయి. దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి పురుగులు ఆశించినట్లు గుర్తిస్తే , సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.

Read Also : Sesame Cultivation : నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు