Mirchi Crop Cultivation : మిరపను కోసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

Mirchi Crop Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటల్లో మిరపది ప్రత్యేక స్థానం.   ఎగుమతులతో ఏటా 4 వేల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఈ పంట  ఉత్పత్తిలో రైతు శ్రమ, సామర్ధ్యం విలువకట్టలేనిది.

Mirchi Crop Cultivation : మిరపను కోసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

Mirchi Crop Cultivation

Mirchi Crop Cultivation : ఆరుగాలం కష్టించి, 6 నెలలపాటు కంటికిరెప్పలా కాపాడుకునే  వాణిజ్య పంట మిరపలో కాయకోత దశ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే  కాయనాణ్యతపైనే మార్కెట్ ధర ఆధారపడి వుంటుంది. ఏమాత్రం అశ్రద్ద చేసినా,  తాలుకాయ ఎక్కువ వచ్చి, రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాధం వుంటుంది. నీటివసతి  కింద మిరప పండించే రైతులు జనవరి నుంచి మార్చి వరకు మిరపకోతలు  చేస్తుంటారు. మరి కాయకోత దశ, మిరప ఎండబెట్టేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు  ఏ విధంగా వుండాలో ఇప్పుడు చూద్దాం.

Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు

నాణ్యమైన దిగుబడులకోసం చేపట్టాల్సిన మెళకువలు : 
తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటల్లో మిరపది ప్రత్యేక స్థానం.   ఎగుమతులతో ఏటా 4 వేల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఈ పంట  ఉత్పత్తిలో రైతు శ్రమ, సామర్ధ్యం విలువకట్టలేనిది. ప్రస్థుతం నీటి వసతికింద  అక్టోబరులో సాగుచేసిన మిరపతోటల్లో కాయకోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

సాధారణంగా జనవరి నుంచి మార్పివరకు మిరపకోతలు కొనసాగుతాయి. 6 నుండి 8 దఫాలుగా కాయ కోతలు జరుపుతారు. అయితే చాలామంది రైతులు  మూడు నాలుగు కోతల్లోనే పంట పూర్తిచేయటం, అపరిపక్వ దశలో కోతలు జరపటం వల్ల  కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో సరైన ధర పొందలేకపోతున్నారు. మిరపలో మొదటి రెండుకోతల్లో, పంట ఇంకా పూత, కాయ అభివద్ధి చెందేదశలోనే వుంటుంది.

అందువల్ల పంట పెరుగుదల, కాయపక్వదశనుబట్టి కోతలు చేస్తూ, కాయలను  ఎండబెట్టేటప్పుడు అఫ్లోటాక్సిన్ లు అభివృద్ధి చెందకుండా తగిన మెళకువలు  పాటించినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు, ఖమ్మం జిల్లా  వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె.హేమంత్ కుమార్.

మిరపకాయలు రంగు మారకుండా నాణ్యంగా వుండేందుకు రాత్రిపూట  కాయలపై మంచుపడకుండా పరదాలు కప్పాలి. ఎండిన కాయలను సంచులలో  నింపేటప్పుడు కొత్త సంచులు ఉపయోగించాలి.

Read Also : Prevention Of Pests : మినుము తోటలకు ఆశించిన చీడపీడల నివారణ