AP Police Recruitment : ఎస్‌ఐ అభ్యర్థులకు రేపటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు

ఏలూరు రేంజ్‌లో మొత్తం 9,689 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించగా వీరిలో 8,247 మంది పురుషులు, 1,442 మహిళలు ఉన్నారు. వీరంతా రేపటి నుండి ప్రారంభం కానున్న దేహదారుఢ్య పరీక్షలు హాజరవనున్నారు.

AP si physical tests

AP Police Recruitment : ఈనెల 25వ తేదీ ఉదయం నుండి ఎస్‌ఐ అభ్యర్థులకు ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ పరీక్ష (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫీషియన్స్‌ పరీక్షలు నిర్వ హించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఏలూరు రేంజ్‌ పరిధిలోని సివిల్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు/మహిళలు), ఏపీఎస్‌పీఆర్‌ఎస్‌ఐ (పురుషులు) ఉద్యోగ ఖాళీల భర్తీకి ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇప్పటికే ప్రాధమిక పరీక్షను పూర్తి చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్ధులకు రేపటి నుండి దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించనున్నారు.

READ ALSO : Sweet Potato Cultivation : ఖరీఫ్ పంటగా చిలగడదుంప సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

ఏలూరు రేంజ్‌లో మొత్తం 9,689 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించగా వీరిలో 8,247 మంది పురుషులు, 1,442 మహిళలు ఉన్నారు. వీరంతా రేపటి నుండి ప్రారంభం కానున్న దేహదారుఢ్య పరీక్షలు హాజరవనున్నారు. ఈ నేపధ్యంలో అన్ని ఏర్పట్లు చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీ ఐజీ అశోక్‌కుమార్‌ మీడియా తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలు జరగనున్న ప్రదేశంలో సీసీ కెమేరాల ఏర్పాటు చేయటంతోపాటు, పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.

READ ALSO : Paddy Transplanter : వరి వెదజల్లే పద్ధతికే మొగ్గుచూపుతున్న రైతులు

ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా, నిష్పక్షపాతంగా పాదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఒరిజినల్‌, జిరాక్స్‌ కాపీలను అందజేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, కమ్యూనిటీ సర్టిఫికెట్‌, క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌, నోటిఫికేషన్‌ తరువాత తీసుకున్న వాటిని అందజేయాలని సూచించారు. అభ్యర్థులు మెటాలిక్‌ స్పైక్‌ షూలను వాడకూడదని ప్లాస్టిక్‌ స్పైక్‌ షూలను మాత్రమే పరుగు పందేంతోపాటుగా ఇతర ఈవెంట్స్‌కు ఉపయోగించాలన్నారు. వర్షాలు పడుతున్న నేపధ్యంలో అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు.