Paddy Cultivation : వరిలో కాండంతోలుచు పురుగు, సుడిదోమ..నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన సస్యరక్షణ

అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది.

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో  వరిపైర్లు  ఈనిక దశనుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. పైరు ఏపుగా పెరిగినప్పటికీ అధిక వర్షాలు, గాలిలో తేమశాతం పెరిగిపోవటంతో ఇప్పుడు సుడిదోమ, ఉల్లికోడు, కాండంతోలుచు పురుగులతో పాటు పలు తెగుళ్ల ఉధృతి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి  తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా, పాలెం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. ఏ. రామకృష్ణబాబు.

READ ALSO : Rice Borer : వరిలో సుడిదోమ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరిపైరులో ఉల్లికోడు, కాండంతోలుచు పురుగులు ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలాచోట్ల వరిపైరులో  ఉల్లికోడు, కాండంతోలుచు పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కలపురుగు గోధుమ రంగులో వుండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి వుంటుంది.  ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు  పెడుతుంది.

READ ALSO : Paddy Crop : వరిలో ప్రస్తుతం ఆశించిన చీడపీడల నివారణ

ఈ గుడ్లపై, తన రెక్కల నూగును కప్పివుంచుతుంది. 5 నుంచి 9 రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగు జేస్తుంది. ఈ పురుగును  సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30 శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ, దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా, పాలెం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. ఏ. రామకృష్ణబాబు.

READ ALSO : yasangi paddy Ownership : యాసంగిలో చలితీవ్రంగా ఉన్న సమయంలో వరి నారుమడి యాజమాన్యం !

అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది. ఆకులు బాగా పెరిగి నేల కనబడకుండా కప్పుతాయి. ఆకుల కింద గాలిలో తేమశాతం పెరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ సుడిదోమ అభివృద్ధికి అనుకూలమైనవి. అంతే కాదు పూత నుండి పాలు పోసుకునే దశలో కాటుక తెగులు ఆశించే అవకాశం  ఉంది . కాబట్టి రైతులు వీటి నివారణకు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.

ట్రెండింగ్ వార్తలు