yasangi paddy Ownership : యాసంగిలో చలితీవ్రంగా ఉన్న సమయంలో వరి నారుమడి యాజమాన్యం !

వానాకాలంలో రకాన్ని, కాలాన్ని బట్టి చ.మీ.కు కుదుళ్ళ సంఖ్య మారుతుంది. దీర్హకాలిక రకాలకు చ.మీ.కు 39 , మధ్యకాలిక రకాలకు 44, న్వల్పకాలిక రకాలకు 66 కుదుళ్ళు ఉండేటట్లు చూనుకోవాలి. యాసంగిలో స్వల్పకాలిక రకాలలో చ.మీ.కు 66 కుదుళ్ళతో అధిక దిగుబడి సాధించవచ్చును.

yasangi paddy Ownership : యాసంగిలో చలితీవ్రంగా ఉన్న సమయంలో వరి  నారుమడి యాజమాన్యం !

yasangi paddy Ownership

yasangi paddy Ownership : యాసంగిలో వరి నారుమడికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. యానంగిలో దమ్ము చేసే నారుమడిలో మండెకట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 సెల్సియన్‌ కంటే తగ్గినప్పుడు, చలి తీవ్రత పెరిగి సరిగా నారు ఎదగక ఎర్రబడి, కొన్నిసార్లు చనిపోతుంది. రెండు. గుంటల నారుమడికి, వర్షాకాలంలో సూచించిన మోతాదులో రసాయనిక ఎరువులతో నత్రజని, పొటాష్‌ తోపాటు పాటు 2 క్వింటాళ్ళ మాగిన కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మికంపోన్టును వేసి కలియ దున్నుకోవాలి. భాస్వరాన్ని దుక్కిలో మోతాదుకు రెట్టింపు వేయాలి.

READ ALSO : Pet Dog : కుక్కను పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

చలి సమస్యను అధిగమించడానికి నారుమళ్ళపైన ఇనువ చువ్వలు/వెదురు కర్రలతో ఊతం ఇచ్చి పైన పలుచని పాలిథీన్‌ షీట్‌ లేదా పాలివూవెన్‌ యూరియా బస్తాలతో తయారు చేసిన వట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి ఉంచి మరునటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రబీలో జింక్‌ లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. కాబట్టి లోపాన్ని సవరించాలి. నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియా వేసినప్పుడు ఒక కిలో యూరియాకి, 2 గ్రా. కార్చండిజిమ్‌ + మాంకోజెబ్‌ మిశ్రమ మందును. కలిపి వేసుకోవాలి. రాత్రి వేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్లవారు జామున తీసివేసి క్రొత్త నీరు పెట్టాలి.

ప్రధాన పొలం తయారి, మొక్కల సాంద్రత :

నాట్లు వేయటానికి 15 రోజుల ముందునుంచే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి 2-3 దఫాలుగా దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా చెక్కతోగాని, జంబుతోగాని, ట్రాక్టరుకున్న లెవలర్‌తోగాని చదును చేయాలి. బాగా మురిగిన ఎడల కలువు తగ్గి, వరి పిలకలు తొడిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. నాలుగు నుండి ఐదు అకులున్న నారును నాటుకోవాలి. కొద్దిగా చౌడున్న పొలాల్లో లేత నారు వేయవద్దు.

READ ALSO : Supreme Court: స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వానాకాలంలో రకాన్ని, కాలాన్ని బట్టి చ.మీ.కు కుదుళ్ళ సంఖ్య మారుతుంది. దీర్హకాలిక రకాలకు చ.మీ.కు 39 , మధ్యకాలిక రకాలకు 44, న్వల్పకాలిక రకాలకు 66 కుదుళ్ళు ఉండేటట్లు చూనుకోవాలి. యాసంగిలో స్వల్పకాలిక రకాలలో చ.మీ.కు 66 కుదుళ్ళతో అధిక దిగుబడి సాధించవచ్చును. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 30 సెం.మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంత వరకు అదువు చేయవచ్చు. బాగా నారు ముదిరి, ఆలన్యంగా నాటినప్పుడు కుదుళ్ళ సంఖ్యను పెంచి, కుదురుకు 6-8 మొక్కల చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటీనవ్పుడు నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25% పెంచి మూడు దఫాలుగా గాని, రెండు దఫాలుగా అంటే 70% నాటే సమయంలో మిగతా 30% అంకురం దశలో వాడాలి.

READ ALSO : TTDP: తెలంగాణలో పోటీపై అయోమయం.. తెలుగు తమ్ముళ్లలో కనిపించని జోష్!

సమగ్ర పోషక యాజమాన్యం;

పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువువంటి. సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే గాక 20-25 శాతం వరకు నత్రజనిని ఆదాచేయవచ్చు. వరి పొలాల్లో నాటటానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెర లాంటి పచ్చి రొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నటం ద్వారా భూసారం పెంచి నుమారు 20-25 శాతం నత్రజని ఆదా చేయవచ్చు. జీవ ఎరువులైన నీలి ఆకువచ్చనాచు, అజొల్లా, అజోస్సైరిల్లమ్‌, ఫోస్ఫోబాక్టీరయా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాన్వర మోతాదులను 10-20% తగ్గించవచ్చు.