Prawn Farming : 200 ఎకరాల్లో స్కాంపి రొయ్య సాగు.. 4 నెలలకు రూ. 4 కోట్ల పైనే ఆదాయం

Prawn Farming : రైతులు వివిధ రకాల హెటిరోట్రోఫిక్, నైట్రిఫైయింగ్ బాక్టీరియా వంటి ప్రోబయాటిక్స్ , అమ్మోనియా బైండర్స్ ఉపయోగించి ఈ విష వాయువులు పెరగకుండా చూసుకోవాలి.

Prawn Farming

Prawn Farming : టైగర్‌ రొయ్య పోయి.. వనామీ వచ్చి దశాబ్ద కాలమైంది. ప్రారంభంలో వనామీ సునామీ సృష్టించింది. సాగు చేసిన వారందరికీ డాలర్ల వర్షం కురిపించింది. అయితే గత ఐదేళ్లుగా వనామీ నష్టాల గొయ్యిుగా మారింది. రొయ్యలు పెంచుతున్న ప్రతి రైతుకి అప్పులే చిక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ, శాస్త్రీయ పద్ధతుల్లో స్కాంపి సాగు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

Read Also : Pond Soil : చెరువు మట్టితో చేనుకు చేవ – తగ్గనున్న రసాయన ఎరువుల వినియోగం

ఇదిగో ఇక్కడ వరుసగా కనిపిస్తున్న రొయ్యల చెరువులను చూడండీ.. ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు మండలం, కోరుపల్లి  గ్రామంలో ఉంది. ముఖ్యంగా ఉండ్రాజవరం మండలంలో అధిక విస్తీర్ణంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా వనామీ సాగులో  పెద్దగా లాభాలు లేవు.

దీనికి కారణం నాణ్యమైన పిల్ల దొరకకపోవడం ఒకటైతే , మేత కొరత ఒకవైపు…  రోగాలు మరోవైపు చుట్టుముట్టి చెరువులు ఖాళీ చేయాల్సిన దుస్థితి దాపురించింది. పైగా వ్యాధుల నియంత్రణకోసం విచక్షణ రహితంగా వాడుతున్న మందులు, యాంటీ బయోటిక్స్‌తో ఎగుమతి చేసిన రొయ్యల కంటెయినర్లు తిరిగి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన పిల్లలను ఎంచుకొని 200 ఎకరాల్లో స్కాంపి రొయ్యల పెంపకం చేపడుతున్నారు రైతు కుందుల సత్యనారాయణ.

సాదారణంగా రొయ్యల పెంపకంలో అనేక సమస్యలు ఉంటాయి.  వినియోగించని మేత, రొయ్యల మలమూత్ర లు, చనిపోయిన శైవలాలు, మరియు రొయ్యలు వదిలిన షెల్స్, కుళ్ళుట వలన చెరువు నీటిలో,  అడుగున ఉన్న మట్టిలో అమ్మోనియా, నైట్రైట్ , హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి హానికరమైన వాయువులు ఉత్పత్తి అయ్యి రొయ్యలు అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటాయి.

రైతులు వివిధ రకాల హెటిరోట్రోఫిక్, నైట్రిఫైయింగ్ బాక్టీరియా వంటి ప్రోబయాటిక్స్ , అమ్మోనియా బైండర్స్ ఉపయోగించి ఈ విష వాయువులు పెరగకుండా చూసుకోవాలి . దీంతో ఖర్చులు పెరుగుతుంటాయి. దిగుబడులు కూడా తగ్గి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి యాంటి బయోటిక్స్ వాడకుండా తక్కువ ఖర్చుతో స్కాంపిరొయ్యలను పెంచుతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

ఎకరం చెరువులో లక్ష స్కాంపి రొయ్యల పిల్లలను పెంచుతున్న రైతు సత్యనారాయణ… 4 నెలల్లో పంట తీస్తున్నారు . ఒక్కో ఎకరాకు పెట్టుబడి దాదాపు 5 లక్షలు అవుతుంది. సరాసరి రెండున్నర టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను ధర తక్కువలో తక్కువ 3 లక్షలు ఉంటుంది. అంటే ఎకరాకు 7 లక్షల 50 వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోను ఎకరాకు 2 నుండి 3 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నారు. ఇలా 200 ఎకరాలపైన 4 నెలలకు సరాసరి 4 కోట్ల నికర ఆదాయం పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు